Japan: జపాన్‌లో కార్చిచ్చు.. కాలి బుడిదైన ఇళ్లు

జపాన్‌లోని పశ్చిమ ప్రాంతంలోని రెండు కార్చిచ్చుల వల్ల వేల సంఖ్యలో చెట్లు కాలి బడిదైపోయాయి. పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి. వందలాది మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు.

New Update
Wildfire in Japan

Wildfire in Japan

జపాన్‌లో కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పశ్చిమ ప్రాంతంలోని రెండు కార్చిచ్చుల వల్ల వేల సంఖ్యలో చెట్లు కాలి బడిదైపోయాయి. పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి. వందలాది మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్ల ద్వారా సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. ఓవైపు ఇవాహరి నగరంలోని చెట్లు కార్చిచ్చుకు కాలిపోతుండగా.. మరోవైపు ఒకాయమా నగరంలో మంటలు చెలరేగడంతో ఇళ్లు కాలిపోయాయి. ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 

Also Read: రాహుల్ గాంధీతో డేటింగ్ చేయడం ఇష్టం : కరీనా కపూర్

ఈ క్రమంలోనే అధికారులు కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాంలో ఉండే అధికారులను ఖాళీ చేయించారు. మంటలు అదుపుచేసేందుకు  రెస్క్యూ టీమ్స్, ఫైర్‌ ఫైటర్స్‌ శ్రమిస్తున్నారు. ఇదిలాఉండగా ఇటీవల అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వేలాది ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. 12 వేలకు పైగా నిర్మాణాలు కాలిపోయాయి.

Wildfires In Japan

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు!

అలాగే మార్చి నెల ప్రారంభంలో నార్త్ కరోలినా, సౌత్‌ కరోలినాలో కూడా కార్చిచ్చు చెలరేగింది. దీనివల్ల దాదాపు 4 వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలిపోయింది. ఈ మంటలకు సౌత్‌ కరోలినాలోని మిర్టిల్‌ బీచ్‌కు చెందిన అలెగ్జాండ్రా బియలౌసౌ (40) అనే మహిళ కారణమని పోలీసులు గుర్తించారు. చివరికి ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజాగా జపాన్‌లో కూడా కార్చిచ్చు చెలరేగడం కలకలం రేపుతోంది. 

Also Read: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్.. భారీగా వీసాలు తిరస్కరణ

Also Read :  వేసవిలో దొరికే ఈ పండు రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది

rtv-news | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
తాజా కథనాలు