/rtv/media/media_files/2025/01/25/bTl3m7FgchgXvCz6ZcwK.jpg)
Tahvur Rana
ముంబై తాజ్ మహల్ హోటెల్ దాడిని ఎన్ని ఏళ్ళయినా ఇండియా మర్చిపోలేదు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కొంత మంది అప్పుడే ఘటన సమయంలో చనిపోగా...కసబ్ ను అరెస్ట్ చేశారు. ఇతనికి భారత కోర్టు ఉరిశిక్ష విధించింది. అది అమలు అయింది కూడా. అయితే ముంబై దాడులుకు కీలక సూత్రధారి అయిన తహవూర్ రాణా మాత్రం అమెరికా లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతనిని అప్పగించాలని భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. తాజాగా ఈ అభ్యర్ధనను అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది.
Also Read: HYD: బంజారాహిల్స్ లో అదుపు తప్పిన కారు..ఒకరు మృతి
తహవూర్ రాణా ఇండియాకు..
తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ఇతన్ని అప్పగించాలని భారత్ చాలాకాలంగా పోరాడుతోంది. అయితే దీన్ని తహవూర్ రాణా చాలా సార్లు ప్రయత్నించాడు. అక్కడి ఫెడరల్ కోర్టుల్లో చాలా సార్లు పిటిషన్ వేశాడు. ఆ కోర్టులన్నీ అతని అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దీంతో చివరిసారి గా గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు తహవూర్ రాణా. అయితే ఈ పిటిషన్ ను కట్టేయాలని కోర్టును అమెరికా ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించి 20 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు అమెరికా ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది. రాణా పిటిషన్ ను కొట్టేసింది. దీంతో అతడిని భారత్ కు అప్పగించే అవకాశాలున్నాయి. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యాక అతనిని భారత్ కు అప్పగిస్తారు. దీనికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
ముంబై 26/11 దాడుల కుట్రకు మాస్టర్ మైండ్ కోల్మన్ హెడ్లీ. ఇతను దాడికి ముందు ముంబైలో రెక్కీ నిర్వహించాడు. ఆ రెక్కీకి తహవూర్ రాణా సహకరించాడు. ముంబయిలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది. ముంబై దాడి తర్వాత అమెరికాకు వెళ్ళిపోయిన రాణాను షికాగోలో అక్కడి ఎఫ్బీఐ అదుపులోకి తీసుకుంది.
Also Read: USA: గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు