BIG BREAKING: వార్షిక రుసుము కాదు..వన్ టైమ్ ఫీజు-వైట్ హౌస్ క్లారిటీ

హెచ్ 1- బీ వీసాల మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న బాంబు పేల్చారు.  వీసా వార్షిక రుసుము లక్ష రూపాలయకు పెంచడం పెను సంచలనానికి దారి తీసింది. దీనిపై వైట్ హౌస్ క్లారిటీ ఇచింది. అది ఇయర్లీ ఫీజు కాదని..వన్ టైమ్ అని చెప్పింది. 

New Update
H1B Visa

H1B Visa

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు $100,000 డాలర్లకు పెంచింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.83 లక్షలు.  ఈ ఫీజు ఏడాదికి ఉంటుందని చెప్పింది. దీంతో ఉద్యోగులగతో పాటూ కంపెనీలు కూడా షాక్ కు గురయ్యాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను వెంటనే వెనక్కు రావాలని పిలిచింది. ఫ్లైట్లు ఒక్క రోజులోనే బుక్ అయిపోయాయి. అలాగే టికెట్ ఖరీదులు కూడా పెరిగిపోయాయి. చాలా మంది తమ భవితవ్యం ఏమవుతుందో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అయితే ఇక ఈదట అమెరికా రావడం కష్టం అవుతుందని బెంగ పెట్టుకున్నారు. అలాగే ఆల్రెడీ వీసాలున్నవారు స్వదేశానికి రావడానికి కూడి అవ్వదని వర్రీ అయ్యారు. 

ఏడాదికి కాదు...ఒక్కసారే..

మొత్తానికి హెచ్ 1- బీ వీసా ఫీజు పెంపు చాలా గందరగోళానికే దారి తీసఇంది. కానీ దీనిపై వౌట్ హౌస్ ఈ రోజు మళ్ళా క్లారిటీ ఇచ్చింది. వీసా రుసుము పెంపు వార్షికానికి కాదని...కేవలం వన్ టైమ్ మాత్రమే నని తేల్చి చెప్పింది. ఈ నిబంధనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టతనిచ్చారు. 

దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే..

హెచ్ 1-బీ వీసాలకు అప్లై చేసినప్పుడు కొంత ఫీజు కట్టాల్సి ఉంటుంది. .. వన్ టైమ్ ఫీజు.  ఇది ఇంతకు ముందు కూడా ఉంది.  ఇప్పట వరకు 80 లక్షల వరకు ఉన్న ఈ రుసుమును ఇప్పుడు లక్ష చేశారు.  అలాగే ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమనని కరోలిన్ లీవిట్ తెలిపారు.  వారంతా ఎప్పటిలానే అమెరికా నుంచి బయటకు వెళ్ళి తిరిగి రావొచ్చని చెప్పారు.  ఈ వన్ టైమ్ లక్ష డాలర్ల ఫీజు భవిష్యత్తులో హెచ్ 1-బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే అమలు అవుతుందని...ఇప్పుడు వీసా రెన్యువల్ ఉన్నవారికి వర్తించదని స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు