Russia-Ukraine War: ట్రంప్, పుతిన్ బుడాపెస్ట్ మీట్ క్యాన్సిల్..టైమ్‌ వేస్ట్‌ అన్న అమెరికా అధ్యక్షుడు

ఎన్ని ప్రయత్నాలు చేసినా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్ల కావడం లేదు. ఇటు పుతిన్, అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇద్దరూ ఆయన మాట వినడం లేదు. తాజాగా బుడాపెస్ట్ సమావేశం కూడా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.

New Update
trump-putin

trump-putin

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య రెండో శిఖరాగ్ర సమావేశానికి ప్రణాళికలు రద్దయ్యాయి . పైగా అదొక వృధా సమావేశమని స్వయంగా ట్రంప్ అనడం గమనార్హం. అందుకే బుడాపెస్ట్ సమావేశాన్ని పక్కన పెట్టేశానని చెప్పారు. నా టైమ్‌ను వృధా చేసుకోవాలను కోవడం లేదని...ఏమి జరుగుతుందో చూద్దామని అన్నారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ మధ్య జరిగిన చర్చల తర్వాత ఇకపై సమావేశం ఏర్పాటు చేయడం లేదని వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు. 

మాస్కో మారడం లేదు..

ట్రంప్, పుతిన్ రెండు నెలల క్రితం అలస్కాలో సమావేశం అయ్యారు. దాని తరువాత మాస్కోల ఇరు దేశాల విదేశాంగ  కార్యదర్శులు మధ్యా చర్చలు జరిగాయి. అయితే ఇందులో ఎటువంటి పురోగతి లభించలేదని...అందుకే బుడాపెస్ట్ సమావేశం కూడా క్యాన్సిల్ చేశారని చెబుతున్నారు. రష్యా వైఖరి ఏం మారలేదని.. ఇప్పటికీ అవే డిమాండ్లను పెడుతోందని అమెరికా చెబుతోంది. ఎవరెంత మాట్లాడినా పుతిన్ కానీ, మాస్కో కానీ తమ పద్ధతులను మార్చుకోవడం లేదని చెప్పింది. మరోవైపు పుతిన్ తమ గగనతలంలోకి ప్రవేశిస్తే..అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్‌ను అమలు చేస్తామని పోలాండ్ హెచ్చరించింది. దీని వలన కూడా ఆయన బుడాపెస్ట్‌కు ప్రయాణించలేరని చెబుతున్నారు. 

మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు మరోసారి లక్షలాది మంది పౌరులను అంధకారంలోకి నెట్టాయి. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని మంగళవారం రష్యా భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా దేశంలోని అనేక కీలక పవర్ గ్రిడ్‌లు, విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ విద్యుత్ శాఖ మంత్రి హెర్మన్ హలుష్చెంకో తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలపై దాడులు జరగడంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా కీవ్‌తో సహా సరిహద్దు ప్రాంతాలలో, రివ్నె, వోలిన్ రీజియన్‌లలో వేలాది కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయి. . రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాలైన ల్వీవ్, జాపోరిజియా, ఒడెస్సా సహా సుమారు తొమ్మిది ప్రాంతాల్లోని పౌర నివాసాలు దెబ్బతిన్నాయి.

Also Read: White House Diwali: వైట్ హౌస్‌లో దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు

Advertisment
తాజా కథనాలు