White House Diwali: వైట్ హౌస్‌లో దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు

భారత ప్రధాని మోదీతో మళ్ళీ ఫోన్‌లో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడానని మళ్ళీ చెప్పారు. భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్ భారత ప్రధాని మోదీ గురించి, రష్యా చమురు గురించి మళ్ళీ పునరావృతం చేశారు.

New Update
trump (1)

భారత ప్రధాని మోదీతో పదే పదే మాట్లాడుతున్నానని ట్రంప్ చెబుతున్నారు. రష్యాతో చమురు వాణిజ్యం మానేస్తారని మోదీ చెప్పారని ట్రంప్ అంతకు ముందు ప్రకటించారు. అయితే దీన్ని భారత విదేశాంగ శాఖ ఖండించింది. దీని తరువాత కూడా మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీతో మాట్లాడడని తెలిపారు. ఈ రోజు విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.  వైట్ హౌస్‌లో దీపాలను కూడా వెలిగించారు. ఈ రోజే మీ ప్రధానితో మాట్లాడానని...చాలా బాగా తమ ఇద్దరి మధ్యనా మంచి చర్చ జరిగిందని చెప్పారు.  తరువాత మోదీ తనకు గొప్ప స్నేహితుడని, గొప్పవ్యక్తి అని అన్నారు. 

వాణిజ్యం, పాకిస్తాన్‌తో యుద్ధం గురించి..

తమ రెండు దేశాల మధ్యనా వాణిజ్యం గురించి చర్చ జరిగిందని..భారత ప్రధానికి దానిపై చాలా ఆసక్తి ఉందని ట్రంప్ చెప్పారు. పాకిస్తాన్‌తో యుద్ధం గురించి మాట్లాడుకున్నామని కూడా తెలిపారు. మోదీ తనతో చాలా బాగా మాట్లాడారని అన్నారు. భారత్‌తో మాకు వివాదాలు లేవు..అది చాలా మంచి విషయమని చెప్పుకొచ్చారు. ఆయన గొప్ప వ్యక్తి, ఆయన చాలా సంవత్సరాలుగా నాకు గొప్ప స్నేహితుడు అయ్యాడన్నారు. 

అమెరికా ప్రపంచం అంతా శాంతి నెలకొల్పుతోందని...మిడిల్ ఈస్ట్‌లో ప్రస్తుతం శాంతి నెలకొందని...అక్కడ మేము సక్సెస్ అయ్యామని చెప్పారు. అన్ని దేశాలతో తాము ప్రస్తుతం స్నేహాన్ని కలిగి ఉన్నామని ట్రంప్ అన్నారు. భారత మోదీతో కూడా రష్యా చమురు గురించి మాట్లాడనని మళ్ళీ చెప్పుకొచ్చారు. తనకు మోదీ హామీ ఇచ్చారని అన్నారు. అయితే భారత్ ఈ విషయం ఒప్పుకోవడం లేదు కదా అని మీడియా ప్రశ్నించగా..అది చేయకపోతే వారు భారీ సుంకాలనే చెల్లిస్తూ ఉండాలి..నాకు తెలిసి భారత్ అలా చేయాలనుకోదని ట్రంప్ అన్నారు.    

Advertisment
తాజా కథనాలు