Minerals in Ukraine: అమెరికా కన్ను ఉక్రెయిన్ ఖనిజాలపై ఎందుకు పడింది ?

మినరల్స్‌ డీల్‌కు సంతకం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అమెరికా.. ఉక్రెయిన్‌ ఖనిజాలపై ఎందుకు ఫోకస్‌ పెట్టిందనేది చర్చనీయం అవుతోంది. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Why the Trump Administration May Want Ukraine’s Minerals

Why the Trump Administration May Want Ukraine’s Minerals

అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజ సంపద ఒప్పందం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ డీల్‌కు సంతకం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఉక్రెయిన్‌ ఖనిజా కోసం అమెరికా ఎందుకు ఇంతగా ప్రాధాన్యం ఇస్తుందనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు, ఇతర పరికరాలు, ఆధునిక ఆయుధాలు, సైనిక పరికరాల తయారు చేసేందుకు వాడే విలువైన ఖనిజ సంపదపై ట్రంప్‌ దృష్టిసారించారు.   

ప్రస్తుతం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన ఖనిజాల సరఫరాలో చైనా గత కొన్ని దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచంలో మొత్తంగా ఈ అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో చైనా వాటా 60 నుంచి 70 శాతం దాకా ఉంది. ప్రాసెసింగ్ సామర్థ్యంలో కూడా చైనాకు 90 శాతం వరకు వాటా ఉంది. అయితే ఈ అరుదైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడటం అమెరికాకు నచ్చడం లేదు. అంతేకాదు ఆర్థిక, సైనిక రంగంలో చైనాతో పోటీ పడేందుకు అమెరికా స్థాయి పడిపోవచ్చని కూడా ట్రంప్ యంత్రాగం భావిస్తోంది.  

Also Read: యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు

ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో ఉన్న ఖనిజ సంపదపై అమెరికా కన్ను పడింది. ప్రపంచంలో మొత్తంగా 30 కీలక ఖనిజాలు ఉన్నాయి. అయితే అందులో 21 ఉక్రెయిన్‌లోనే ఉన్నాయి. ఉక్రెయిన్‌ దగ్గరున్న ఈ ఖనిజాల నిల్వలు ప్రపంచంలో ఉన్న అరుదైన భూ ఖనిజాల నిల్వలో 5 శాతం. ఖనిజాల నిల్వలు చూసుకుంటే చాలావరకు క్రిస్టలైన్ షీల్డ్‌ దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి. ఇది అజోవ్‌ సముద్రం పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడ చాలావరకు ప్రాంతాలు ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్నాయి. 
 
ఉక్రెయిన్‌లో కోటీ 90 లక్షల టన్నులు గ్రాఫైట్‌ నిల్వలు ఉన్నాయి. వీటిని ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో వాడుతారు. అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీలు తయారు చేసేందుకు అవసరమైన లిథియం నిల్వలు కూడా ఉక్రెయిన్‌లో దండిగా ఉన్నాయి. యూరప్‌లో అతిపెద్ద లిథియం నిల్వల్లో మూడో వంతు ఉక్రెయిన్‌లో ఉండటం విశేషం. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచంలోని టైటానియంలో 7 శాతం ఉక్రెయినే ఉత్పత్తి చేసేది. విమానాలు, విద్యుత్ కేంద్రాలు ఇంకా అనేక వాటిల్లో టైటానియంను ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజ నిల్వలను రష్యా స్వాధీనం చేసుకుంది. దాదాపు 350 బిలియన్ డాలర్ల విలువైన ఖనిజ వనరులను రష్యా తన అధీనంలోకి తీసుకున్నట్లు ఇటీవల ఉక్రెయిన్‌ తెలిపింది. 

Also Read: మళ్లీ తండ్రయిన మస్క్.. 14వ సారి.. ఏం పేరు పెట్టారో తెలుసా?

అందుకే ఉక్రెయిన్‌లో ఉన్న ఖనిజ సంపదపై అమెరికా దృష్టి పడింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. అమెరికా సాయం లేకుండా తాము మనుగడ సాధించడం కష్టమని ఇటీవల జెలెన్‌స్కీ కూడా అన్నారు. తాను అధ్యక్షుడిని అయ్యాక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని ట్రంప్‌ కూడా ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే భాగంలో.. ఉక్రెయిన్‌కు తాము అండగా ఉండాలంటే ఖనిజ సంపదలు ఇవ్వాలనే షరతు పెట్టింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని 500 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 43 లక్షల కోట్లు) విలువైన ఖనిజ సంపద తమకు ఇవ్వాలని చెప్పింది. మొదటగా జెలెన్‌స్కీ దీనికి అంగీకరించలేదు. కానీ ఇప్పుడు ఆయన ఖనిజ సంపంద ఒప్పందంపై సంతకం పెట్టేందుకు సిద్ధమని చెప్పడం చర్చనీయాంశమవుతోంది.   

అరుదైన ఖనిజాలు ఏంటి ?

అరుదైన ఖనిజాలను స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, వైద్య పరికరాలు వంటి అనేక వస్తువుల్లో ఉపయోగిస్తున్నారు. సీరియమ్, ప్రెసిడోనియమ్, నియోడైమియం, ప్రోమేథియం,  గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, హోల్మియం, స్కాండియమ్, వాయీట్రియమ్, లేంథనమ్,ఎర్బియం, థోలియం, లుటెటియం,సమారియం, యూరోపియం వంటి అరుదైన ఖనిజాల జాబితాలోకి వస్తాయి. వీటి స్వచ్ఛమైన రూపాలు కనుగొనడం దాదాపుగా అసాధ్యం. అందుకే వీటిని అరుదైన ఖనిజాలుగా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా కొన్నిచోట్ల మాత్రమే ఈ ఖనిజాలు ఉన్నాయి. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు