Budget 2024: తగ్గనున్న బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు
లిథియం, కాపర్, కోబాల్ట్ లాంటి 25 ఖనిజాల మీద కస్టమ్స్ సుంకాలను పూర్తిగా మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని కారణంగా బ్యాటరీల ధరలు తగ్గుతాయి. బ్యాటరీల ధరలు తగ్గితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.