Putin Slams USA: రష్యా చమురును అమెరికా మాత్రమే కొనాలా? అగ్రరాజ్యంపై పుతిన్ తీవ్ర విమర్శ

అమెరికాకు ఒక న్యాయం..భారత్ ఒక న్యాయం ఎలా వర్తిస్తాయంటూ అగ్రరాజ్యంపై దండెత్తారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యా దగ్గర అమెరికా చమురు కొంటున్నప్పుడు ఇండియా ఎందుకు కొనకూడదని నిలదీశారు.

New Update
putin (1)

భారత్ కు బయలుదేరే ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకున్నారు. భారత్, రష్యా బంధం ఏ ఒక్కరికీ, ఏ దేశానికీ వ్యతిరేకం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. ఈ బంధం రెండు దేశాల ప్రయోజనాలను కాపాడుకోవడానికేనని చెప్పారు. భారత్ పెరుగుదలను చాలా మంది తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే రష్యాతో సన్నిహిత సంబంధాలను వద్దని చెబుతున్నారని..మాటవినకపోయే సరికి వేరే రకంగా ప్రయత్నాలు చేస్తున్నారని పరోక్షంగా అమెరికాపై విమర్శలు చేశారు.

ఒకరికి ఒక రూల్, మరోకరిమరొకటి ఎలా?

అగ్రరాజ్యం అమెరికాపై పుతిన్ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత ప్రయోజనాల కోసం ఇతరులపై అధికారాన్ని చెలాయిస్తున్నారన్నారు. ఆయన సొంత ఎజెండా ఉంది. ఆయనకు ప్రత్యేక లక్ష్యాలున్నాయి. అలానే మాకు మా సొంత లక్ష్యాలున్నాయని చెప్పుకొచ్చారు. రష్యా నుంచి భారత్‌ ముడి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అభ్యంతరాలను పుతిన్‌ తోసిపుచ్చారు. రష్యా చమురును కొనడానికి అమెరికాకు హక్కున్నప్పుడు భారత్‌కు ఎందుకు ఉండదని ప్రశ్నించారు. అణు ఇంధనం కూడా రష్యా దగ్గరేకొనుక్కుంటున్నారని తెలిపారు. ట్రంప్ ఏం చేసినా రష్యా, భారత్ లు తమ స్వంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటాయని తెగేసి చెప్పారు పుతిన్. ప్రస్తుతం భారత్ చమురు దిగుమతులు తగ్గడంపై ప్రశ్నించగా..దిగుమతులు తగ్గడం వాస్తవమేనని..కానీ అది కేవలం స్వల్ప సర్ధుబాటు మాత్రమేనని తెలిపారు వాణిజ్య టర్నోవరులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

మోదీ చాలా స్ట్రాంగ్..

భారత్‌ను ప్రపంచం గ్లోబల్‌ పవర్‌గా చూస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్నారు. ప్రధాని మోదీ ఇతర శక్తుల ఒత్తిడికి తలొగ్గే వ్యక్తి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌-రష్యా మధ్య ఇంధన సహకారం కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి ఆర్థిక విధానాలను అనుసరించాలన్నది తమ ఇష్టమని పరోక్షంగా ట్రంప్‌ టారిఫ్‌ల అంశాన్ని విమర్శించారు. భారత్‌-రష్యా మధ్య ఉన్న వాణిజ్య అంతరాన్ని భర్తీ చేసేందుకు కృషి చేస్తామని పుతిన్‌ తెలిపారు. అందులో భాగంగా భారత్‌ నుంచి దిగుమతులు పెంచుకుంటామన్నారు.

Advertisment
తాజా కథనాలు