/rtv/media/media_files/2026/01/06/venezuela-2026-01-06-13-41-27.jpg)
Who is Barry Pollack, the lawyer defending Nicolas Maduro in the US courtroom?
అమెరికా సైనిక చర్యల తర్వాత వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సోమవారం న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరయ్యారు. ఆయనపై నార్కో టెర్రరిజం, మనీలాండరింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రముఖ అమెరికన్ న్యాయవాది బారీ జె.పొల్లాక్ మదురో తరఫున కోర్టుకు హాజరయ్యారు. వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అస్సాంజ్‌ను అమెరికా చట్టపరమైన కస్టడీ నుంచి విడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
Also Read: ఉత్తరప్రదేశ్‌లో సర్ ముసాయిదా జాబితా విడుదల.. భారీగా ఓట్ల తొలగింపు
బారీ పొల్లాక్ వాషింగ్టన్‌కు చెందిన లా ఫర్మ్ హారిస్ సెయింట్ లారెంట్ అండ్ వెంచర్స్‌లో భాగస్వామిగా ఉన్నారు. జాతీయ భద్రత, అంతర్జాతీయ చట్టం, ఉన్నత స్థాయి కేసులను పరిష్కరించడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనకు నాయవాద వృత్తిలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంతర్జాతీయ కేసుల్లో నిందితులుగా ఉన్న అనేక మంది కార్పొరేట్ దిగ్గజాలను , రాజకీయ నాయకులను ఆయన నిర్దోషిగా బయటకు తీసుకొచ్చారు. 17 ఏళ్ల జైలు శిక్ష తర్వాత విడుదలైన మార్టిన్ ట్యాంక్లెఫ్ కేసులో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. అందుకే నికోలస్ మదురో కూడా తన ప్రధాన న్యాయవాదిగా బారీ పొల్లాక్‌ను ఎంచుకున్నారు. ఇక నికోలస్ మదురో భార్య సిలియా ఫ్లోర్స్ తరఫున మరో న్యాయవాది హాజరయ్యారు.
Also Read: వెనెజువెలాలో మళ్లీ ఎన్నికలు ?.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్
దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన విచారణలో నికోలస్ మదురో తాను నిర్దోషినని చెప్పారు. తనపై అభియోగంమోపిన నార్కో-టెర్రరిజం (మాదకద్రవ్యాల అక్రమ రవాణా), మనీలాండరింగ్ వంటి అన్ని ఆరోపణలను తిరస్కరించారు. తనను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారని కోర్టులో వాదించారు. ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ కూడా తాను నిర్దోషినంటూ తెలిపారు. చివరికి ఈ కేసును కోర్టు తదుపరి విచారణ కోసం మార్చి 17కి వాయిదా వేసింది. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Follow Us