/rtv/media/media_files/2026/01/06/trump-2026-01-06-12-44-57.jpg)
Trump
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆ దేశంలో 30 రోజుల్లో ఎన్నికలు జరగొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 30 రోజుల్లో వెనెజువెలాలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ లేదని అన్నారు. అక్కడి ప్రజలు ఇప్పుడు ఓటు వేసే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. ముందుగా ఆ దేశాన్ని సుస్థిరపర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Also Read: ఉత్తరప్రదేశ్‌లో సర్ ముసాయిదా జాబితా విడుదల.. భారీగా ఓట్ల తొలగింపు
దీనికోసం వెనెజువెలా ఆర్థిక వ్యవస్థను, ఇంధన మౌలిక సదుపాయాలను మళ్లీ నిర్మించడంపై ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు కనీసం 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాదు ఈ అభివృద్ధి కార్యకలాపాల కోసం కావాల్సిన ఖర్చులను అమెరికాకు చెందిన ఇంధన సంస్థలే భరిస్తాయని అన్నారు. ఆ తర్వాత వాటికి వచ్చిన ఆదాయంలో తమ ఖర్చులను తిరిగి తీసుకుంటాయని వెల్లడించారు.
Also Read: ప్రమాదంలో తాజ్ మహల్.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైర్
ఇదిలాఉండగా నికోలస్‌ను నిర్బంధించిన తర్వాత ఆ దేశ అధ్యక్ష బాధ్యతలను విపక్ష నేత మచాడోకు అప్పగించేందుకు ట్రంప్ నిరాకరించారు. అయితే దీనిపై తాజాగా ఆమె స్పందించారు. వెనెజువెలాలో అధికారం కోసం తాను ట్రంప్‌తో ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో తనకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన రోజున చివరిసారిగా ట్రంప్‌తో మాట్లాడినట్లు గుర్తుచేశారు. మళ్లీ ఆయన్ని కలవలేదని చెప్పారు. త్వరలో స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నానని అన్నారు.
Follow Us