/rtv/media/media_files/2025/12/16/trump-2025-12-16-19-46-31.jpg)
Trump sues BBC for $10bn over edited 2021 US Capitol riot speech
Trump: అమెరికాలో 2021లో క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి ఘటన అప్పట్లో సంచలన రేపింది. ఆ సమయంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినట్లు బీబీసీపై ఆరోపణలు వచ్చాయి. క్రమంలోనే తాజాగా ట్రంప్.. బీబీసీపై పరువు నష్టం దావా వేశారు. తన ప్రసంగాన్ని సవరించి జనాలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు తనకు 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.90 వేల కోట్లు) నష్ట పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మియామిలోని ఫెడరల్ కోర్టులో 46 పేజీలతో దావా వేశారు. తన ప్రసంగాన్ని రెండుచోట్ల సవరణలు చేసి మార్చారంటూ ఆరోపణలు చేశారు.
Also Read: సూర్యఘర్ స్కీమ్‌తో 7.71 లక్షల కుటుంబాలకు నో కరెంట్ బిల్లు
తనకు పరువు నష్టం కలిగించడంతో పాటు ఫ్లొరిడా చట్టాలు ఉల్లంఘించారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ రెండు ఆరోపణలపై తనకు 5 బిలియన్ డాలర్ల చొప్పున 10 బిలియన్ డాలర్లు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా 2021 జనవరి 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌పై ట్రంప్ సపోర్టర్లు దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా ట్రంప్ గంట సేపు మాట్లాడారు.
Also Read: భారీగా H-1B, H-4 వీసాలు ‘రద్దు’..ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్
బీబీసీ దీనిపై ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. అందులో ట్రంప్.. క్యాపిటల్ హిల్‌కు వెళ్తున్నాం. మీతో పాటు నేను అక్కడికి వస్తున్నాను. మనం పోరాడుదాం, ఘోరంగా ఫైట్ చేద్దాం అన్నట్లు కనిపించింది. ఈ డాక్యుమెంటరీపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. చివరికి ట్రంప్ రాజకీయ ఒత్తిడితో బీబీసీకి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టీమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేశారు.
🚨 BREAKING: The BBC has just been sued for $10 BILLION by President Trump for manipulatively editing his Jan. 6th speech to make him sound like an insurrectionist
— Eric Daugherty (@EricLDaugh) December 16, 2025
The BBC is COOKED!
They will be paying for Trump's library! FAFO🤣🔥 pic.twitter.com/0D0OSSl8ZD
Follow Us