/rtv/media/media_files/2025/12/16/visa-2025-12-16-18-57-20.jpg)
హెచ్ 1బీ, హెచ్ 4 వీసాదారులకు గ కొంత కాలంగా కష్టకాలం నడుస్తోంది. వీరిపై ఆంక్షల బాంబులు పడుతూనే ఉన్నాయి. కొత్తగా హెచ్ 1బీ అప్లై చేసుకునే వారు లక్ష డాలర్ల ఫీజు కట్టాలని ట్రంప్ గవర్నమెంట్ రూల్ పెట్టింది. అలాగే ఆల్రెడీ హెచ్1 వీసాలు ఉన్న వారిపై కూడా కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్ 1బీ, హెచ్ 4 వీసాల సోషల్ మీడియా వెట్టింగ్ ప్రారంభం అయింది. డిసెంబర్ 15 నుంచి దీనిని మొదలుపెట్టారు. దీనికోసం డిసెంబర్ 9 నుంచే వీసాల ఇంటర్వ్యూలను ఆపేశారు. 15 తర్వాత వీసా ఇంటర్వ్యూలు ఉన్న వారందరినీ పోస్ట్ పోస్ట్ చేశారు. దీంతో వేల మంది తన స్వదేశాల్లో ఇరుక్కుపోయారు. చాలా వీసా ఇంటర్య్యూలు వాయిదా పడడంతో భారత్ చాలా మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో వీసా కేంద్రాల ముందు వారు ధర్నాలకు దిగుతున్నారు.
భారీగా రద్దవుతున్న వీసాలు..
దీనికి తోడు ఇప్పుడు యూఎస్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ వీసా ప్రుడెన్షియల్ రివోకేషన్ ను మొదలుపెట్టింది. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానం వస్తే వెంటనే వారి వీసాను క్యాన్సిల్ చేస్తున్నారు. అయితే ఇది తాత్కాలిక రద్దుగానే పరిగణించబడుతుంది. ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కును ప్రభావితం చేయదు. కానీ తర్వా వీరు ఎప్పుడైనా వీసా అపాయింట్‌మెంట్ కు వెళితే మాత్రం..ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే ప్రుడెన్షియల్ రివోకేషన్ లో వీసాలు రద్దు అయినప్పటికీ వీసాదారులు తమ గడువు పూర్తయ్యేవరకు అమెరికాలో ఉండొచ్చు. అయితే, ఒకసారి బయటకు వెళ్తే.. వీసా గడువు ఉన్నప్పటికీ మళ్లీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంప్ చెల్లుబాటు కాదు. ఇప్పటికే చాలా మంది వీసాలను దీని కింద రద్దు చేశారని తెలుస్తోంది. చాలా మంది తమ వీసాలు రద్దయిన విషయాన్ని ఈ మెయిల్స్ ద్వారా తెలుసుకున్నామని చెబుతున్నారు.
Follow Us