అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్‌ స్వీట్ రియాక్షన్!

గౌతమ్‌ అదానీపై కేసు వ్యవహారంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ స్పందించింది. మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని ఇరుదేశాలు అధిగమించగలవని తెలిపింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌, న్యాయశాఖనే సరైన సమాచారం ఇవ్వగలదని పేర్కొంది.

New Update
White House reaction to Adani case

ప్రముఖ భారత పారిశ్రామికవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికా తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్‌లో ప్రభుత్వ అధికారులకు రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చారని అభియోగాలు మోపింది. ఆ డబ్బు కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని అదానీ, అతని మేనళ్లుడు సాగర్ అదానీతో పాటు మరో 7 మందిపై కేసు నమోదైంది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ స్పందించింది. 

Also Read:'మెకానిక్ రాకీ' రివ్యూ.. విశ్వక్ యాక్షన్, కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?

వైట్‌హౌస్‌ స్పందన

ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని విశ్వాసం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరీన్‌ జీన్‌ పియర్‌ మీడియా సమావేశంలో అదానీ గ్రూప్‌ వ్యవహారం గురించి రియాక్ట్ అయ్యారు. అదానీపై కేసు నమోదు అయిన విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అయితే ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖ అయితేనే సరైన సమాచారం ఇవ్వగలవని తెలిపారు. 

Also Read:జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్​ ఖరారు!

అయితే ఈ వ్యవహారంతో తమ ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. భారత్ - అమెరికా మధ్య సంబంధాలు ఎప్పటిలాగానే చాలా బలంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా అనేక అంశాలపై పరస్పర సహకారం అందించుకుంటున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుతం ఉన్న సంక్షోబాన్ని ఇరుదేశాలు అధిగమించగలవు అని తెలిపారు. 

Also Read:ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ భయం అవసరం లేదు!

కెన్యా ఒప్పందాలు రద్దు

ఇదిలా ఉంటే అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో కెన్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూపుతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది.

Also Read:కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. !

ఎయిర్‌పోర్ట్‌ కాంట్రాక్ట్‌ , విద్యుత్‌ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తెలిపారు. విద్యుత్‌ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్‌- ప్రైవేటు భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు గానూ..కెన్యా ప్రభుత్వం 736 మిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని అదానీ గ్రూపుతో కుదుర్చుకుంది. ఇప్పుడు అది కాస్తా ఆగిపోయింది.

Advertisment