/rtv/media/media_files/2025/02/03/B1ruvYHvOzV4ojspVCCI.jpg)
whatsapp hack Photograph: (whatsapp hack)
WhatsApp hacked: ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్ ఫాం వాట్సాప్ యూజర్ల అకౌంట్లు హ్యాక్ జరుగుతున్నట్లు మెటా సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 3.14 బిలియన్ల మంది ఈ యాప్ వాడుతున్నట్లు అంచనా. అయితే అందులో 12 దేశాలకు చెందిన 90 మంది యూజర్ల ఖాతాలు హ్యాక్ అయినట్లు మెటా అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ కంపెనీ పారగాన్ సొల్యూషన్స్ వాట్సాప్ యూజర్లపై సైబర్ అటాక్ చేసిందట. Meta పారగాన్ సొల్యూషన్స్‌కు ఓ లెటర్ జారీ చేసింది. వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ దెబ్బతీసే కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని మెటా హెచ్చరించింది.
HUNDREDS of WhatsApp accounts hacked by Israeli spyware firm Paragon Solutions
— RT (@RT_com) January 31, 2025
Perpetrators used 'zero-click attacks', meaning that targeted journos and civil society members did not have to do any actions to have their devices infected
WhatsApp is now pursuing legal action pic.twitter.com/w16UH6zbtT
Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!
అలాగే వాట్సాప్ యూజర్ల సేఫ్టీ, కమ్యూనికేషన్ కాపాడటానికి నిరంతరం కష్టపడుతున్నట్లు మెటా వినియోగదారులకు భరోసా ఇచ్చింది. ప్రపంచవ్యా్ప్తంగా ఉన్న జర్నలిస్టులు, కీలక నేతల అకౌంట్లే అటాక్‌కు గురైనట్లు తెలిపింది. ఇందులో ఐరోపా దేశాలకు చెందిన వారి వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. కరెక్ట్‌గా వారి వివరాలు కూడా తెలియదు. ఇలాంటి సైబర్ అటాక్స్ జరిగినప్పటికీ, యూజర్ల అనుమతి లేంది ప్రైవేట్ కమ్యూనికేట్ డేటా లీక్ కాదని మెటా స్పష్టం చేసింది.
Also Read: BIG BREAKING: మరో పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. పొంగులేటి సంచలన ప్రకటన