/rtv/media/media_files/2025/04/26/5hiQ3x9R7q8efnh2h4Cw.jpg)
భారత దాడులను పాక్ సైన్యం ధ్రువీకరించింది. పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 8 మంది చనిపోయారని...22 మంది గాయాల పాలయ్యారని పాక్ ఆర్మీ తెలిపింది. దీనికి బదులు తీర్చుకుంటామని పాక్ డీజీ ఐఎస్‌పీఆర్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ అన్నారు. సమయం చూసుకుని జవాబు ఇస్తామని చెప్పారు.
ఎలా ఎదుర్కోవాలో తెలుసు..
పాక్ ప్రధాని షెహబాజ్ కూడా భారత ఆర్మీ మెరుపు దాడులపై స్పందించారు. శత్రువులు పాకిస్తాన్ లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపారని..దీనికి తమ దేశం కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని అన్నారు. పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడిందని చెప్పుకొచ్చారు. పాక్ ప్రధాని ప్రకటన తర్వాత.. సరిహద్దులోని పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైతం కాల్పులు మొదలుపెట్టింది. ఎల్‌వోసీ వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసునని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ దాడులను యుద్ధ చర్యలని అభివర్ణించారు. ప్రత్యర్థి ప్రణాళికలను ఎట్టిపరిస్థితుల్లో
నెరవేరనీయమని చెప్పారు.
దేశం మొత్తం అలెర్ట్..
భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ మొత్తం అప్రమత్తమైంది. లాహోర్, సియాల్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది. ఈ దాడులపై ఈరోజు ఉదయం 10.30 గంటలకు పాక్ ప్రధాని షెహబాజ్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. మరోవైపు సరిహద్దుల్లో భారత ఎయిర్ డిఫెన్స్ అలెర్ట్ అయింది. అన్ని వ్యవస్థలను మోహరించి...పాక్ సైన్యాన్ని నిలువరించేందుకు సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చని భారత ఆర్మీ భావిస్తోంది.
"Operation Sindoor" It's Done.
— Adv Jony Ambedkarwadi 🇮🇳 (@TheJonyVerma) May 6, 2025
Thanks ❤️ Indian Army 😎 🪖
Jai Hind 🇮🇳#OperationSindoorpic.twitter.com/STgidlMTFU
Indian Armed Forces Launch Operation Sindoor: Precision Strikes Against Terrorist Camps .. @news24tvchannelpic.twitter.com/idSgMcp3bl
— asifsuhaf (@asifsuhaf) May 6, 2025
today-latest-news-in-telugu | attacks | pakistan | pakistan-pm-shehbaz-sharif