IND-PAK WAR : పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్

పహల్గాం దాడుల తర్వాత వాటర్‌, దౌత్యదాడులతో పాకిస్థాన్‌ పై ఒత్తిడి పెంచిన భారత్‌ మరోసారి దాన్నే అనుచరిస్తోంది. ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉన్నసలాల్ ఆనకట్ట 5గేట్లను భారత అధికారులు తెరిచారు. దీంతో పాక్ లో నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది.

New Update

Operation Sindoor : పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్‌ ప్రతీకార దాడులకు దిగింది. ఉగ్రవాద శిబిరాలు టార్గెట్‌గా మెరుపు దాడులు చేసింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో పాక్‌ భారత భూభాగంపై దాడులకు తెగబడుతోంది పాకిస్థాన్ .  పహల్గాం దాడుల తర్వాత వాటర్‌, దౌత్యదాడులతో పాకిస్థాన్‌ పై ఒత్తిడి పెంచిన భారత్‌ తాజాగా మరోసారి అదే పంథాను అనురిస్తోంది.ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోఉన్న చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ ఆనకట్ట 5 గేట్లను భారత అధికారులు తెరిచారు. దీంతో పాకిస్తాన్ వైపు నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. దీనివల్ల పాకిస్థాన్‌లో వరదలు వచ్చే అవకాశం ఉందని భావిస్తు్న్నారు. వాటర్ వార్ తో పాక్‌ కు గట్టి షాక్‌ ఇచ్చినట్లయింది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు

అంతకుముందు పాకిస్తాన్ వైపు నీటి ప్రవాహాన్ని భారతదేశం సలాల్, బాగ్లిహార్ డ్యామ్ గేట్లను మూసివేసింది. దీంతో పాకిస్తాన్‌లోని చీనాబ్ నీటి మట్టం 2-3 అడుగులకు తగ్గింది. అయితే ఇప్పుడు పాకిస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నీటి మట్టం పెరిగడంతో ఆనకట్ట గేట్లు తెలిచారు. దీంతో పాక్ లోని నదీప్రవాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఓ వైపు యుద్ధం మరో వైపు వాటర్‌ వార్‌తో పాక్ కు దెబ్బమీద దెబ్బ తగులుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది.

ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు
 
ఇక సింధు జల ఒప్పందం విషయంలో కూడా భారతదేశం కఠినంగానే వ్యవహరిస్తోంది, 1960లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం సట్లెజ్, రావి, బియాస్ నదులపై  భారతదేశం హక్కులను పొందింది, సింధు, జీలం, చీనాబ్ నదులపై హక్కులు పాకిస్తాన్‌కు వచ్చాయి. ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో జరిగింది. కానీ, ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భారత్ ఈ ఒప్పందాన్ని సమీక్షించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ప్రపంచబ్యాంక్‌ స్పష్టం చేసింది.

Also Read: IND-PAK WAR: రాహుల్ గాంధీ వీడియోను లైవ్ లో చూపించిన పాక్ ఆర్మీ.. కొత్త స్కెచ్?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు