/rtv/media/media_files/2025/07/24/wartime-protests-in-ukraine-target-zelensky-for-the-first-time-2025-07-24-10-08-25.jpg)
Wartime Protests in Ukraine Target Zelensky for the First Time
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి బిగ్ షాక్ తగిలింది. అవినీతి నిరోధక సంస్థను బలహీనపర్చేందుకు ఆయన తీసుకొచ్చిన బిల్లుపై నిరసన సెగ తలగింది. ఫలితంగా రాజధాని కీవ్‌లో భారీ ఆందోళనలు చెలరేగాయి. ఇటీవల ఆయన ఈ బిల్లుపై సంతకం చేయడంతో అంతర్జాతీయంగా కూడా తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉక్రెయిన్‌లోని నేషనల్ యాంటీ కరెప్షన్ బ్యూరో, స్పెషలైజ్డ్ యాంటీ కరెప్షన్ ప్రాసిక్యూషన్ ఆఫీస్‌ను ప్రాసిక్యూటర్ జనరల్ అధీనంలోకి తీసుకొచ్చారు. అయితే దీన్ని సమర్ధిస్తూ బుధవారం జెలెన్‌స్కీ మాట్లాడారు.
Also Read: అసలెక్కడా లేని దేశం...దానికో రాయబార కార్యాలయం..ఘజియాబాద్ లో హైటెక్ మోసం
రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే అవినీతి నిరోధక వ్యవస్థల పనితీరు నాసిరకంగా ఉందని వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లంఘించే వాళ్లకి శిక్ష తప్పదన్న విషయాన్ని ప్రాసిక్యూటర్ జనరల్ నిర్ధరిస్తారని పేర్కొన్నారు. అయితే ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో వేలాది మంది ప్రజలు రోడ్డెక్కారు. జెలెన్‌స్కీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. 2022లో రష్యా ఆక్రమణ తర్వాత కీవ్‌లో ఈ స్థాయిలో నిరసనలు చెలరేగడం ఇదే మొదటిసారి. ల్వివ్, డెనిప్రో, ఒడెసాలో కూడా ఆందోళనలు జరిగాయి.
దీనిపై ఓ నిరసనాకారుడు ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు. '' మేము ఐరాపాను ఎంచుకున్నామని నియంతను కాదని అన్నాడు. మా నాన్న దీనికోసం ప్రాణత్యాగం చేయలేదని చెప్పాడు. గత పదేళ్లుగా నడుస్తున్న ప్రజాస్వామ్యం, అవినీతి వ్యతిరేక చర్యలకు ఈ బిల్లు ఆటంకం కలిగిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఉక్రెయిన్‌లో బలమైన అవినీతి వ్యతిరేక వ్యవస్థ వల్లే పశ్చిమ దేశాలతో సంబంధాలు మెరుగుపడ్డాయి. అలాగే నిధులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఐరోపా కమిషన్ ప్రతినిధి గిల్లామ్ మెర్సియర్ స్పందించారు. దేశంలో చోటుచేసుకంటున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉంటున్నాయని చెబుతున్నారు.
Also Read: రష్యా మహిళను బహిష్కరించొద్దు : కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
ఇదిలాఉండగా అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అత్యంత సన్నిహుతుడు రుస్లాన్ క్రావ్చెంకో ఉక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొత్త బిల్లు ప్రకారం చూసుకుంటే నేషనల్ యాంటీ కరెప్షన్ బ్యూరో (నాబు)లో ఉన్న రష్యా గూఢచారుల కోసం ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసు, ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీసు తనిఖీలు చేపట్టి అరెస్టు చేస్తుంది. మరోవైపు ఇది దుర్వినియోగం అవుతందని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.