/rtv/media/media_files/2025/03/12/BDGXjsMz9ngTU1pHX8uy.jpg)
Trump Buys Telsa
నాకు నువ్వూ..నీకు నేను అంటూ ఒకప్పుడు అంటిపెట్టుకుని తిరిగిన వారిద్దరూ ఇప్పుడూ బద్ధ శత్రువుల్లా కొట్టుకుంటున్నారు. డోజ్ నుంచి బయటకు వచ్చేసిన దగ్గర నుంచీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. బ్యూటిఫుల్ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ ట్రంప్ తో గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు. మరోవైపు అధ్యక్షుడు కూడా ఏమీ తగ్గడం లేదు. ఎలాన్ మీద నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. దీనికి తోడు నిన్న ఏకంగా మస్క్ ట్రంప్ కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీనే ప్రకటించడంతో ఈ గొడవలు మరోసారి భగ్గు మన్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు కూడా రియాక్ట్ అయ్యారు. మస్క్ గాడి తప్పారు..పార్టీ ఓ పెద్ద జోక్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో టెస్లా షేర్లు భారీగా తనమయ్యాయి. మెరికా మార్కెట్‌లో సూచీలు ఒక దశలో దాదాపు 8శాతం మేర నష్టాలను తాకాయి. టెస్లా రాయితీలు కోల్పోతుందనే భయాందోళనలో పెట్టుబడిదారులు ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త పార్టీతో సంచలనం..
ఇన్నాళ్లు అమెరికా రాజకీయాల్లో కేవలం రిపబ్లికన్, డెమొక్రటిక్రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పార్టీ ఆవిర్భవించినట్లయింది. ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ‘అమెరికా పార్టీ’ అనే మూడో రాజకీయ పార్టీని మస్క్ తాజాగా లాంచ్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన సూచనలకు సానుకూలంగా స్పందించిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, తన ప్లాట్‌ఫామ్ ఎక్స్ వినియోగదారుల నుంచి అఖండ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
గతంలోనే పార్టీ పెడుతానని ప్రకటించిన ఆయన "మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు లభిస్తుంది! ఈ రోజు, మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది," అని ఎలాన్ మస్క్ 'ఎక్స్' గతంలో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే దాన్ని ఇప్పుడు నిజం చేశారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ బహిరంగంగానే మద్ధతు ప్రకటించారు. అయితే ఒకప్పటి కీలక మిత్రుడుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మస్క్‌కి పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు.