Shamshabad Airport : పశ్చిమాసియాలో యుద్ధం..శంషాబాద్‌లో పలు విమానాలు రద్దు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ నేపథ్యంలో శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇండియా నుంచి పలు దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు భారీ సంఖ్యలో రద్దయ్యాయి.

New Update
Shamshabad Airport

Shamshabad Airport

Shamshabad Airport : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ నేపథ్యంలో శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు(airlines) రద్దయ్యాయి. ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారతీయ విమానయాన రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఇరాన్‌ పశ్చిమాసియాలోని పలు దేశాలపై దాడులు చేస్తుండటంతో ఆయా దేశాల్లో ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఆయా దేశాలు తమ గగనతలాల్ని మూసివేశాయి. దీంతో ఇండియా నుంచి పలు దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు భారీ సంఖ్యలో రద్దయ్యాయి. - iran us war

యుద్ధ భయం ఎదుర్కొంటున్న పలు దేశాలు తమ దేశంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పలు విమానాలు రద్ధయ్యాయి. విమాన సర్వీసుల రద్దు కారణంగా వివిధ దేశాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు. అయితే ఆయా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం మూలంగా భారీ సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ఇప్పటికే ఢిల్లీ ఐజీఐ సుమారు 100 వరకు సర్వీసులను రద్దు చేసింది.అదే సమయంలో చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 30 సర్వీసులను, బెంగళూరు ఎయిర్‌పోర్టు 50 విమాన సర్వీసులను రద్దు చేసింది.

Also Read :  Iran War: ఇరాన్ దాడులు.. దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు..

War In West Asia - Flights Cancelled In Shamshabad

ఇరాన్ - ఇజ్రాయెల్(iran-israel) దేశాల మధ్య యుద్ధం కారణంగా విమానాయన సంస్థలు భారీగా తమ విమానాలను రద్దు చేసుకుంటున్నాయి.శంషాబాద్ విమానాశ్రయం నుంచి పలు గల్ఫ్‌ దేశాలకు వెళ్లా్ల్సిన విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. అలాగే కువైట్, దుబాయ్, మస్కట్, మదీనా వెళ్లే సర్వీసులు కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయా విమానయాన సంస్థలు వెల్లడించాయి.
 
ఇప్పటికే శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన ఆయా దేశాలకు వెళ్లా్ల్సిన సుమారు 100 వరకు విమాన సర్వీసులు రద్దు కాగా, ఆయా దేశాల నుంచి శంషాబాద్‌ కు రావలసిన 22 విమానాలు కూడా రద్దయ్యాయి. యుద్ధం నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి విమానయాన సంస్థలు పలు  విమానాలను రద్దు చేసుకున్నాయి. అదే సమయంలో పశ్చిమాసియా, మిడిల్‌ ఈస్ట్‌  దేశాలకు వెళ్లా్ల్సిన ప్రయాణీకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ప్రయాణికులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచించింది. అలాగే ప్రయాణీకులు  ఫ్లైట్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు ఎయిర్‌ లైన్‌ వెబ్‌ సైట్‌లతో పాటు ఎయిర్‌పోర్ట్ అధికారుల ద్వారా తెలుసుకోవాలని డీజీసీఏ సూచించింది. - iran us conflict

Also Read :  Israel: లెబనాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్..

Advertisment
తాజా కథనాలు