Iran War: ఇరాన్ దాడులు.. దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు..

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల ప్రస్తుతం తన ఇద్దరు కుమార్తెలు నివృత్తి, నావిష్కలతో కలిసి దుబాయ్‌లో ఉన్నారు.

New Update
iran us war

iran us war

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలువురు సెలబ్రేటీలు(celebreties) దుబాయ్‌లో చిక్కుకుని ఇబ్బందులకు గురవుతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల ప్రస్తుతం తన ఇద్దరు కుమార్తెలు నివృత్తి, నావిష్కలతో కలిసి దుబాయ్‌లో ఉన్నారు. దీంతో  మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా, శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ తాము సురక్షితంగా ఉన్నామని వెల్లడించారు. - america iran crisis

Also Read :  ఏపీ, కర్ణాటకలో రహస్య చమురు నిల్వలు.. 74 రోజులు మాత్రమే భారత్ సేఫ్

Chiranjeevi Daughter Sreeja

 "మేము దుబాయ్‌(dubai) లో సురక్షితంగా, రక్షణగా ఉన్నాము. మా క్షేమం కోరి మెసేజ్‌లు, ఫోన్లు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని శ్రీజ పేర్కొన్నారు. బుర్జ్ ఖలీఫా, దుబాయ్ స్కైలైన్‌తో కూడిన ఫోటోను షేర్ చేస్తూ, శాంతి నెలకొనాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు కూడా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. దుబాయ్ మీదుగా మరో దేశానికి వెళ్లాల్సి ఉండగా, హఠాత్తుగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.  హీరోయిన్ సోనాల్ చౌహాన్ దుబాయ్‌లో చిక్కుకున్నారు. విమానాల రద్దుతో భారత్‌కు రావడానికి మార్గం లేక ఇబ్బంది పడుతున్నానని, తనను సురక్షితంగా రప్పించాలని ఆమె భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఇరాన్ జరిపిన ప్రతికార దాడుల్లో(america iran war) దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద స్వల్ప నష్టం వాటిల్లింది. జెబెల్ అలీ పోర్ట్ వద్ద ఆయిల్ డిపోల సమీపంలో మంటలు చెలరేగినట్లు వార్తలు వచ్చాయి. యూఏఈ ప్రభుత్వం ప్రజలకు అత్యవసర అలర్ట్‌లు జారీ చేసింది. కిటికీలకు దూరంగా ఉండాలని, సురక్షిత భవనాల్లో తలదాచుకోవాలని సూచించింది. స్కూల్, విశ్వవిద్యాలయాలకు సెలవు ప్రకటించి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. బుర్జ్ అల్ అరబ్ వంటి ఐకానిక్ భవనాల వద్ద డ్రోన్‌లను అడ్డుకున్న సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Also Read :  విజయ్- రష్మిక పెళ్లి... ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్.. దేశమంతా సెలబ్రేషన్స్‌

Advertisment
తాజా కథనాలు