Venezuela: వెనెజువెలా నుంచి భారత్‌కు భారీగా చమురు.. రంగంలోకి సూపర్ ట్యాంకర్లు

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత రష్యా నుంచి చమురు కొనగోళ్లు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెనెజువెలా తమ చమురును విదేశాలకు ఎగుమతులు చేసేందుకు రెడీ అవుతోంది.

New Update
Venezuela sends mega 2-million-barrel oil cargoes to India as exports surge

Venezuela sends mega 2-million-barrel oil cargoes to India as exports surge

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత రష్యా నుంచి చమురు కొనగోళ్లు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెనెజువెలా తమ చమురును విదేశాలకు ఎగుమతులు చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా భారత్‌కు భారీగా చమురును పంపించనుంది. ఇందుకోసం 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమరును మోసుకెళ్లగలిగే సూపర్ ట్యాంకర్లను రంగంలోకి దింపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వెనెజువెలాకు చెందిన చమురు సంస్థలు ఎగుమతుల కోసం మొదటిసారిగా వెరీ లార్జ్ క్రూడ్ ఆయిల్  క్యారియర్‌లను (VLCC)ను అద్దెకు తీసుకున్నాయి.  

దీనివల్ల భారత్‌కు చమురు ఎగుమతులు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ట్రేడింగ్ సంస్థలయిన విటోల్, ట్రాఫిగురా చమురును ఎగుమతులు చేస్తున్నాయి. మరోవైపు వెనెజువెలాకు చెందిన ప్రభుత్వ ఆయిల్ కంపెనీ నిర్వహిస్తున్న జోస్‌ టెర్మినల్‌లో నిస్సోస్‌ కీ, నిస్సోస్ కైత్నోస్‌, అర్జానా అనే మూడు నౌకలకు మార్చిలో లోడింగ్‌ చేయడం కోసం స్లాట్లు కూడా కేటాయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మూడు కూడా భారత్‌కు రానున్నట్లు పేర్కొన్నాయి.  అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ప్రైవేట్‌ రిఫైనరీ HMELలు ఇప్పటిదాకా చెరో మిలియన్‌ బ్యారెళ్ల చొప్పున చమురును వెనెజువెలా నుంచి కొనుగోలు చేశాయని వెల్లడించాయి. 

Also Read: ఇండియాకు ట్రంప్ 'బిగ్ షాక్'.. మళ్లీ మొదలైన ట్రేడ్ వార్.. వాటిపై 126% సుంకాలు!

సూపర్ ట్యాంకర్లు (VLCC) ఎందుకు ?

వెనిజులా, భారత్ మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. అందుకే రవాణా ఖర్చులను తగ్గించేందుకు VLCC (Very Large Crude Carriers) వంటి సూపర్ ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. ఒక సూపర్ ట్యాంకర్‌కు దాదాపు 2 మిలియన్ బారెల్స్ చమురును మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంటుంది. ఈ ట్యాంకర్లు వెనెజువెలా నుంచి అట్లాంటిక్ మహాసముద్రం,  కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా భారతీయ తీరాలకు చేరుకుంటాయి.

భారత్‌కు కలిగే లాభాలు

వెనిజులా బారెల్‌కు సుమారు $6.5 నుంచి $10 వరకు డిస్కౌంట్‌ ఆఫర్ ఇస్తోంది. అయితే వెనిజులా నుండి చమురు దిగుమతి చేసుకుంటే భారత్ తన దిగుమతి బిల్లులో దాదాపు $3 బిలియన్ల (సుమారు రూ.25,000 కోట్లు) వరకు ఆదా చేయవచ్చు. భారత్ ఇకనుంచి చమురు అవసరాల కోసం రష్యా లేదా సౌదీ మీద ఆధారపడకుండా వెనిజులా ప్రత్యామ్నాయంగా మారనుంది. 

Also Read: లండన్‌లో పెరుగుతున్న పాకిస్థాన్ ఆధిపత్యం.. 16 ఏళ్లనాటి ఇండియన్ రెస్టారెంట్‌ మూసివేత..

నష్టాలు

ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం వెనెజువెలాపై ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో మళ్లీ ఆంక్షలు విధిస్తే భారత్ మధ్యలోనే తమ చమురు దిగుమతులు ఆపేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మన ఇంధన ప్రణాళికను మళ్లీ దెబ్బతీయొచ్చు. ఒకవేళ వెనెజువెలాలలో అక్కడక్కడ అంతర్గత తిరుగుబాట్లు లేదా ప్రభుత్వ మార్పులు జరిగితే సరఫరా నిలిచిపోయే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు వెనెజువెలా చమురులో సల్ఫర్, లోహాల శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని శుద్ధి చేసేందుకు ఖర్చు కూడా ఎక్కువగానే అవుతుంది. సాధారణ రిఫైనరీలు దీనిని హ్యాండిల్ చేయలేవు. తక్కువ ధరకే చమురు దొరికినప్పటికీ.. దాన్ని శుద్ధి చేసేందుకు అయ్యే అదనపు ఖర్చు వల్ల కొంత నికర లాభం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. 

Advertisment
తాజా కథనాలు