/rtv/media/media_files/2026/02/25/indian-solar-sector-2026-02-25-12-17-13.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు గట్టి వ్యూహాత్మక షాక్ ఇచ్చారు. భారత సౌర విద్యుత్ పరికరాల దిగుమతులపై ఏకంగా 126 శాతం సుంకాలను విధిస్తూ అమెరికా వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుంది. 'అమెరికా ఫస్ట్' విధానంలో భాగంగా తీసుకున్న ఈ చర్య, భారత్-అమెరికా మధ్య ఇటీవలే కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ప్రమాదంలో పడేసింది. భారతదేశం తన దేశీయ సోలార్ ప్యానెల్ తయారీదారులకు అన్యాయంగా సబ్సిడీలు ఇస్తోందని, దీనివల్ల భారతీయ ఉత్పత్తులు అమెరికన్ తయారీదారుల కంటే చౌకగా మారి మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయని యూఎస్ వాణిజ్య శాఖ పేర్కొంది. కేవలం భారత్‌పైనే కాకుండా, ఇండోనేషియాపై 86-143 శాతం, లావోస్‌పై 81 శాతం సుంకాలను విధించారు.
STORY | US announces preliminary 126% countervailing duty on imports of certain Indian solar goods
— Press Trust of India (@PTI_News) February 25, 2026
The US has announced preliminary countervailing duty of 125.87 per cent on imports of certain Indian solar goods, alleging that the products are unfairly subsidised by New Delhi.… pic.twitter.com/VgIC0zdDZR
ఒప్పందాలు పక్కన.. 'అమెరికా ఫస్ట్' కే ప్రాధాన్యం!
కొన్ని వారాల క్రితమే భారత్-అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భారత ఎగుమతులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గించాల్సి ఉంది. అయితే, ట్రంప్ తాజా నిర్ణయంతో ఈ ఒప్పందం అర్థరహితంగా మారింది. వ్యూహాత్మక భాగస్వామ్యం కంటే స్వదేశీ ప్రయోజనాలకే ట్రంప్ మొగ్గు చూపారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వారం జరగాల్సిన భారత్-అమెరికా ఉన్నత స్థాయి అధికారుల మూడు రోజుల సమావేశం కూడా వాయిదా పడింది.
ఇప్పుడు నష్టం!
అమెరికాలో చైనా ఉత్పత్తులపై కఠిన నిబంధనలు ఉండటంతో, చైనీస్ కంపెనీలు తమ ఉత్పత్తిని ఆగ్నేయాసియా దేశాలకు తరలించాయి. దీనివల్ల భారత్ ప్రధాన లబ్ధిదారుగా మారింది. 2024లో భారత్ నుండి సోలార్ ప్యానెల్ దిగుమతులు $792.6 మిలియన్లకు చేరాయి. ఇది 2022 కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ. 2025 మొదటి అర్ధభాగంలో యూఎస్ సోలార్ దిగుమతుల్లో భారత్, ఇండోనేషియా, లావోస్ వాటా 57 శాతంగా ఉంది.
అమెరికాలో పెరుగుతున్న ప్రాజెక్ట్ ఖర్చులు
ఈ నిర్ణయాన్ని అమెరికన్ దేశీయ తయారీదారులు స్వాగతిస్తున్నప్పటికీ, సోలార్ ప్రాజెక్టులు నిర్మించే కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. భారత్ నుండి సరఫరా ఆగిపోతే ప్రాజెక్ట్ ఖర్చులు భారీగా పెరుగుతాయని, ఇప్పటికే అధిక వడ్డీ రేట్లతో సతమతమవుతున్న పరిశ్రమ మరింత కుదేలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సబ్సిడీలపై తుది నిర్ణయం జూలై 6, 2026 నాటికి వెలువడనుంది. అప్పటి వరకు ఈ ప్రాథమిక సుంకాలు అమల్లో ఉంటాయి. ఒకవేళ ఇవి శాశ్వతమైతే, భారత సోలార్ ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవాల్సి ఉంటుంది.
Follow Us