/rtv/media/media_files/2026/02/14/uss-gerald-r-ford-2026-02-14-07-11-30.jpg)
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు(america iran conflict) మరోసారి యుద్ధం దిశగా మలుపు తిరుగుతున్నాయి. తాజా పరిణామాలు గమనిస్తే ఇరాన్‌పై పూర్తిస్థాయి సైనిక చర్యకు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌకను పశ్చిమాసియాకు తరలించడం సంచలనం రేపుతోంది. వెనెజువెలాలో నికోలస్ మదురోను బంధించే ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్(USS Gerald R. Ford), ఇప్పుడు పశ్చిమాసియా దిశగా పయనమైంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ నౌకకు ఇది తోడవ్వనుంది. ఇది పశ్చిమాసియాలో అమెరికా సైనిక బలాన్ని రెట్టింపు చేయడమే కాకుండా, ఇరాన్‌పై ఒత్తిడిని పెంచే వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.
Also Read : ఇండియాకు ఇరాన్, బొలివియా బిగ్ షాక్.. వీసా లేకుండా రావద్దన్న దేశాలు
చర్చలు విఫలం- ట్రంప్ వార్నింగ్
ఒకవైపు చర్చలంటూనే, మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమంపై కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు. ఇటీవల ఒమన్, ఖతార్ వేదికగా అమెరికా మధ్యవర్తులతో ఇరాన్ భద్రతాధికారులు జరిపిన ఉన్నత స్థాయి చర్చలు ఫలప్రదం కాలేదని తెలుస్తోంది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థపై రాజీ పడబోమని స్పష్టం చేయగా, అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేస్తేనే శాంతి సాధ్యమని అమెరికా పట్టుబడుతోంది.
Also Read : బంగ్లాదేశ్‌తో భారత్‌కు మళ్లీ మంచిరోజులు.. కొత్త ప్రధాని దోస్త్ మేరా తారిఖ్ రెహమాన్!
'మిడ్‌నైట్ హ్యామర్' భయం
ఇరాన్ తన మొండివైఖరిని వీడకపోతే మిడ్‌నైట్ హ్యామర్ వంటి తీవ్రమైన సైనిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ గతంలోనే వార్నింగ్ ఇచ్చాడు. ఎఫ్-35 స్టీల్త్ ఫైటర్లు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్‌లో అంతర్గతంగా జరుగుతున్న నిరసనలను కూడా అమెరికా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.
"ఒప్పందం కుదరకపోతే మాకు భారీ సైనిక శక్తి అవసరమవుతుంది, అందుకే రెండో యుద్ధ నౌకను పంపిస్తున్నాం" అని ట్రంప్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్యే కాకుండా, మొత్తం ప్రపంచ శాంతికే ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Follow Us