/rtv/media/media_files/2026/02/13/bangladesh-2026-02-13-09-59-03.jpg)
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘనవిజయం సాధించింది. భారత్ ప్రధాని మోదీ తారిఖ్ రెహమాన్‌కు శుక్రవారం శుభాకాంక్షలు చెబుతూ Xలో ట్వీట్ చేశారు. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలలో ఓ కొత్త మలుపుగా పరిగణించవచ్చు. ఇండియా ఈ విజయాన్ని ఒక 'రీసెట్' బటన్‌గా భావిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన అనిశ్చితికి తెరపడి, ఒక సుస్థిర ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని న్యూఢిల్లీ ఆశిస్తోంది.
I convey my warm congratulations to Mr. Tarique Rahman on leading BNP to a decisive victory in the Parliamentary elections in Bangladesh.
— Narendra Modi (@narendramodi) February 13, 2026
This victory shows the trust of the people of Bangladesh in your leadership.
India will continue to stand in support of a democratic,…
అక్కడ షేక్ హసీనా గవర్నమెంట్ కూలిపోయాక ఇండియాతో బంగ్లాదేశ్ సంబంధాలు పూర్తిగా దెబ్బతాయి. ఇటీవల యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వంలో అక్కడ మైనర్లపై దాడులు పెరిగిపోయాయి. అంతేకాదు ముస్లీం ముస్లీం భాయ్, భాయ్ అంటూ పాకిస్తాన్‌తో చేతులు కలిపి భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించింది బంగ్లాదేశ్. ప్రస్తుతం అక్కడ తారిఖ్ రెహమాన్ పార్టీ గెలవడంతో ఇండియాకు మంచిరోజులు రానున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారం చేపడితే భారత్‌కు అనుకూలమైన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1. ప్రాంతీయ స్థిరత్వం
గత కొంతకాలంగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం హయాంలో భారత్-బంగ్లా సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడటం వల్ల సరిహద్దుల్లో శాంతి నెలకొనే అవకాశం ఉంది. ప్రధాని మోదీ ఇప్పటికే తారిఖ్ రెహమాన్‌కు అభినందనలు తెలపడం ఒక సానుకూల సంకేతం.
2. ఉగ్రవాద నియంత్రణ మరియు భద్రత
గతంలో (2001-2006) బిఎన్‌పి పాలనలో భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాదేశ్ వేదికగా మారిందనే ఆందోళనలు ఉండేవి. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ పాకిస్థాన్ అనుకూల శక్తులకు (జమాత్-ఇ-ఇస్లామీ వంటివి) దూరంగా ఉండటం భారత్‌కు ఊరటనిచ్చే అంశం. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి బంగ్లాదేశ్ సహకారం భారత్‌కు చాలా కీలకం.
3. మైనారిటీల రక్షణ
బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల భద్రత విషయంలో తారిఖ్ రెహమాన్ సానుకూల ప్రకటనలు చేశారు. బంగ్లాదేశ్ అందరికీ చెందిన దేశమని, మైనారిటీలు సురక్షితంగా ఉంటారని ఆయన హామీ ఇవ్వడం భారత్‌కు దౌత్యపరంగా కలిసొచ్చే అంశం.
4. ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలు
కనెక్టివిటీ: భారత్ తన ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లడానికి బంగ్లాదేశ్ గుండా ట్రాన్సిట్ సౌకర్యాలు పొందుతోంది. కొత్త ప్రభుత్వం వీటిని కొనసాగించడం వల్ల వాణిజ్యం మెరుగుపడుతుంది.
తీస్తా జలాల ఒప్పందం: ఈ వివాదం పరిష్కారమైతే ఉభయ దేశాల మధ్య ఆర్థిక సహకారం మరింత పెరుగుతుంది. తారిఖ్ రెహమాన్ "బంగ్లాదేశ్ ఫస్ట్" విధానాన్ని అనుసరించినా, భారత్‌తో సమానమైన, గౌరవప్రదమైన సంబంధాలను కోరుకుంటున్నారు.
5. చైనా-పాకిస్థాన్ ప్రభావం తగ్గడం
మధ్యంతర ప్రభుత్వం పాకిస్థాన్ మరియు చైనాలకు దగ్గరవుతోందనే వార్తల నేపథ్యంలో, బిఎన్‌పి విజయం భారత్‌కు తన పొరుగుదేశంలో మళ్లీ పట్టు సాధించే అవకాశాన్ని ఇస్తుంది. తారిఖ్ రెహమాన్ ఢిల్లీ మరియు రావల్పిండిలకు సమదూరం పాటిస్తామని ప్రకటించినా, భారత్‌తో ఉన్న చారిత్రక, భౌగోళిక సంబంధాల వల్ల సహకారం అనివార్యం.
Follow Us