/rtv/media/media_files/2025/01/25/Nx9L9CgT2sn5FOrhIrev.jpg)
Gulf Of Mexico
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కార్యవర్గం పనులు జోరుగా చేస్తున్నారు. వరుసపెట్టి ఆర్డర్లను పాస్ చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసలపై అరెస్ట్ లు చేయడం, ఇతర దేశాల వారిని వెనక్కు పంపించడం లాంటివి ఒక పక్క జరిగిపోతున్నాయి. మరోవైపు అమెరికా సమూలంగా మార్పులను చేస్తున్నారు. తాజాగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికా మారినట్లు వైట్ హౌస్ కార్యవర్గం ప్రకటించింది. దాంతో పాటూ అలస్కన్ శిఖరం డెనాలిని పేరును కూడా మౌంట్ మెకిన్లీగా మార్చారు. ఈ పేరు మార్పులతో అగ్రరాజ్యం అసాధారణ వారసత్వం నిలుస్తుందని..గల్ష్ ఆఫ్ అమెరికా చరిత్రను భవిష్యత్తులో అందరూ జరుపుకుంటారని ట్రంప్ కార్యవర్గం తెలిపింది. అయితే ట్రంప్ ఆదేశాల ప్రకారం జియోలాజికల్ సర్వే పేరును మార్చిన్పటికీ అంతర్జాతీయంగా ఇది సాధ్యం కాదని తెలుస్తోంది.
Also Read: Cinema: సీజ్ ద లయన్ అంటున్న రాజమౌళి..ఎస్ఎస్ఎమ్బీ29 షూటింగ్ మొదలైనట్టేనా?
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ఇది ఒకటి..
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మారుస్తానని ట్రంప్ చాలాసార్లు చెప్పారు. అన్నట్టుగానే పదవిని స్వీకరించిన వెంటనే గల్ఫ్ ఆఫ్ అమెరికా గా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ, శక్తిమంతమైన దేశంగా దాని స్థానాన్ని అది పొందిందని చెప్పారు. అయితే మెక్సికో గవర్నమెంట్ కు ఇది ఇష్టం లేదు. 1607 నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఆ పేరుతో పిలుస్తున్నారని ఆమె ఛెప్పారు. ఉత్తర అమెరికాలో దాదాపు ఆరు లక్షల చదరపు మైళ్ల సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద జలవనరుల్లో ఇది తొమ్మిదవ స్థానంలో ఉంది. అమెరికాలో వినియోగించే సగానికి పైగా శుద్ధి చేసిన గ్యాస్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అమెరికాలో వినియోగించే 40 శాతం మత్స్య సంపద ఇక్కడే దొరుకుతుంది.
Also Read: HYD: బంజారాహిల్స్ లో అదుపు తప్పిన కారు..ఒకరు మృతి