/rtv/media/media_files/2025/12/10/usa-2025-12-10-08-34-01.jpg)
US revokes 85,000 visas amid sweeping immigration and security crackdown
చాలామంది పైచదువుల కోసం, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలని అనుకుంటారు. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులపై చర్యలకు దిగడంతో అక్కడి వీసా పొందడం కష్టతరంగా మారిపోయింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 85 వేల వీసాలను రద్దు చేసినట్లు తాజాగా ట్రంప్ యంత్రాంగం ప్రకటన చేసింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో దీనిపై పోస్టు చేసింది.
జనవరి నుంచి 85000 వీసాలు రద్దు చేయబడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్, సెక్రటరీ రూబియో ఒక సాధారణ ఆదేశానికి కట్టుబడి ఉన్నారు. త్వరలో ఆ పనిని నిలిపివేయాలన్న ఉద్దేశం వారికి లేదు'' అంటూ రాసుకొచ్చింది. దీనికి ట్రంప్ ఫొటోను జోడించింది. ఆ ఫొటోపై 'మేక్ అమెరికా సేఫ్ ఏగైన్' అని రాసిఉంది. అమెరికా ఇమిగ్రేషన్ విధానంలో ట్రంప్ యంత్రాంగం కఠినంగా ఎలా చర్యలు తీసుకుంటుందనే సందేశాన్ని ఈ ట్వీట్ సూచిస్తోంది.
85,000 visa revocations since January.
— Department of State (@StateDept) December 9, 2025
President Trump and Secretary Rubio adhere to one simple mandate, and they won't stop anytime soon⤵️ pic.twitter.com/fbNYw9wj71
వీసా రద్దయిన వాటిలో 8 వేలకు పైగా స్డూడెంట్ వీసాలు ఉన్నాయని స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి తెలిపారు. గతేడాది కన్నా ఇది రెట్టింపు అని అన్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ అండర్ ది ఇన్‌ఫ్లుయెన్స్ (DUI), దాడులు, దొంగతనాల వంటి కేసుల్లోనే చాలావరకు వీసాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి నేరాలు స్థానికులకు ముప్పుగా మారుతాయన్నారు. వీసా రద్దు కావడానికి మిగతా కారణాలను ఆ అధికారి వెల్లడించలేదు. గతంలో చూసుకుంటే వీసా కాల పరిమితి అయిపోయిన కూడా అక్కడే ఉండటం, నేరాలకు పాల్పడటం, ఉగ్రవాదానికి మద్దతు తెలపడం లాంటి వారి వీసాలు కూడా రద్దు చేశారు. అయితే ఈసారి పలు క్యాంపస్‌లలో గాజాకు సపోర్ట్ చేస్తూ నిరసనలు చేసిన విదేశీ విద్యార్థులను ట్రంప్ యంత్రాంగం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పలుమార్లు వాళ్లని ఉగ్రవాద గ్రూప్‌లకు సపోర్ట్ చేస్తున్నట్లు ఆరోపణలు కూడా చేసింది.
Also Read: డ్యూటీ టైం తర్వాత నో ఆఫీస్ కాల్స్, మెయిల్స్.. పార్లమెంట్ లో రైట్ టూ డిస్‌కనెక్ట్ బిల్!
అమెరికాలో ఉంటున్న దాదాపు 5.5 కోట్ల విదేశీయుల వీసాలపై ఇటీవల వెట్టింగ్ పాలసీని మరింత విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ వీసాదారులకు సంబంధించి ఏదైన సమాచారం బయటపడితే వెంటనే వారి వీసాలు రద్దు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది అత్యధికంగా వీసాలు రద్దయ్యాయి. ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే 19 దేశాలపై ప్రయాణాల ఆంక్షలు విధించింది. అయితే దీన్ని 30 నుంచి 32 దేశాలకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఇటీవల వాషింగ్టన్‌లో ఇద్దరు నేషనల్ గార్డు సభ్యులపై ఓ అఫ్గానిస్థాన్ జాతీయుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ విధానంపై ట్రంప్ సర్కార్ కఠినంగా చర్యలు తీసుకుంటోంది.
Follow Us