/rtv/media/media_files/2025/11/20/raffel-2025-11-20-07-46-37.jpg)
అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్, చైనా సంబంధాలు దెబ్బ తినేలా రాసింది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిజేసిందని రిపోర్ట్ లో నివేదించింది. ఏఐను ఉపయోగించి తయారు చేసిన నకిలీ ఫోటోలను ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చైనా ప్రచారం చేసినట్లు అమెరికా కాంగ్రెస్ నిపుణుల సంఘం వెల్లడించింది. వాటిలో రఫేల్ యుద్ధ విమానాల శకలాలను చూపించినట్లు తెలిపింది. తమ క్షిపణులతో భారత్, ఫ్రాన్స్ యుద్ధ విమానాలను కూల్చేశామని చైనా ప్రచారం చేసుకున్నట్లు చూపించింది. రఫేల్ యుద్ధ విమానాలపై ప్రపంచ వ్యాప్తంగా ఉ్న నమ్మకాన్ని దెబ్బ తీయడమే చైనా లక్ష్యమని యూఎస్ కాంగ్రెస్ అంటోంది. అలా చేస్తే తమ సొంత జే-35 విమానాలకు డిమాండ్ పెరుగుతుందని ఆ దేశం భావించిందని తెలిపింది.
చైనా నాటకాలాడుతోంది..
చైనా అనుసరిస్తున్న గ్రే జోన్ స్ట్రాటజీలో ఇదొక భాగమని అమెరికా కాంగ్రెస్ రిపోర్ట్ లో తెలిపింది. ప్రత్యక్ష సైనిక ఘర్షణ లేకుండానే భౌగోళిక రాజకీయాలపై ప్రభావం చూపడానికి చైనా ఇలాంటి వ్యూహాలను ఉపయోగిస్తుందని అంది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని చైనా తన గొప్పలను, ఆయుధ సంపత్తి గురించి ప్రచారం చేసుకోవాలని భావించిందని కమిషన్ తన నివేదికలో వివరించింది. ఆపరేషన్ సింధూర్ లో పాక్ పై భారత్ పైచేయి సాధించింది. దీంతో భారత సైనిక సామర్థ్యం ప్రపంచం అంతటికీ తెలిసింది. అందుకే చైనా డిజిటల్ దాడికి దిగిందని అమెరికా అంటోంది.
దీంతో పాటూ భారత్, చైనాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాల పరిష్రారం గురించి కూడా నివేదికలో చెప్పింది. దౌత్య చర్చల ద్వారా కొన్ని పాక్షిక పరిష్కారాలను మాత్రమే అంగీకరించి సరిహద్దు అంశాన్ని పక్కన పెట్టాలని చైనా చూస్తున్నట్లు తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులకు ఓకే చెబుతూనే భౌగోళిక డిమాండ్ల విషయంలో తగ్గవద్దని చైనా భావిస్తోందని అమెరికా చెబుతోంది. సరిహద్దు సమస్యపై ఇరు దేశాల మధ్య కుదిరిన ఇటీవలి ఒప్పందాలు తాత్కాలికంగా ఉన్నాయని .. వాటి అమలుకు మాత్రం స్పష్టమైన విధానాలు లేవని యూఎస్ కాంగ్రెస్ విమర్శించింది. అలాగే దలైలామా ఎంపిక విషయంలో కూడా భవిష్యత్తులో భారత్, చైనాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలను పెంచెవచ్చని చెబుతోంది. భారత ప్రధాని మోదీ..చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ.. అమెరికా సుంకాల నేపథ్యంలో భారత్ అనుసరిస్తున్న వ్యూహంలో భాగమని అభిప్రాయపడింది.
Also read: ఇండియాలో భారీ దాడులకు జైషే కుట్ర.. ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ
Follow Us