/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
రష్యా అధ్యక్షుడు పుతిన్ మీ ట్రప చాలా కోపంగా ఉన్నారు. చెప్పిన మా వినడం లేదని కాల్పులు విరమణ కు అంగీకరించకపోగా..కనీసం చర్చలకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుతిన్ నిప్పుతో ఆడుకుంటున్నారని ట్రంప్ విరుచుకుపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఇదే విషయం మీద కామెంట్ చేసిన ఆయన మళ్ళీ దీనిపై ట్రూత్ పోస్ట్ పెట్టారు. ఇక్కడ నేను లేకుండా రష్యాకు చాలా చెడు జరిగి ఉండేది. చాలా నష్టం జరిగి ఉండేది. ఈ విషయాన్ని పుతిన్ తెలుసుకోవడం లేదు. ఆయన నిప్పుతో ఆడుకుంటున్నారు అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు. అంతకు ముందు పుతిన్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన రష్యా సైన్యం ఆ దాడిని తిప్పికొట్టండడంతో పుతిన్ తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఉక్రెయిన్‌పై మిసైళ్లు, డ్రోన్లతో రష్యా విరుచుకుపడుతోంది. ఈ పరిణామాలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుతిన్ పూర్తిగా పిచ్చి పట్టినట్లు ప్రవరిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఏ ప్రయత్నం చేసినా.. అది రష్యా పతనానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్‌లో దీనిపై పోస్ట్ చేశారు. '' నాకు పుతిన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. కొన్నిసార్లు మాత్రం ఆయనకు ఏం అవుతుందో అర్థం అవ్వడం లేదు. పుతిన్ పూర్తిగా పిచ్చిపట్టినట్లు ప్రవరిస్తున్నారు. అవసరం లేకున్నా కూడా చాలామందిని చంపేస్తున్నారు.
today-latest-news-in-telugu | america president donald trump | putin | ukraine
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!