Greenland: ట్రంప్ సంచలన నిర్ణయం.. గ్రీన్‌లాండ్‌ విలీనం కోసం బిల్లు ప్రవేశపెట్టిన అమెరికా

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. తాజాగా రిపబ్లికన్ పార్టీ 'గ్రీన్‌లాండ్‌ విలీనం రాష్ట్ర హోదా' అనే పేరుతో బిల్లును ప్రవేశపెట్టింది. ఆ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

New Update
US Lawmaker Introduces Bill For Greenland's 'Annexation And Statehood'

US Lawmaker Introduces Bill For Greenland's 'Annexation And Statehood'

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. తాజాగా రిపబ్లికన్ పార్టీ 'గ్రీన్‌లాండ్‌ విలీనం రాష్ట్ర హోదా' అనే పేరుతో బిల్లును ప్రవేశపెట్టింది. ఆ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని రాండీ తెలిపారు. అమెరికా శత్రువులు ఆర్కిటిక్‌ ప్రాంతంలో పట్టు సాధించేందుకు యత్నిస్తున్నాయని.. కానీ ఇలా జరగనివ్వమని అన్నారు. 

Also Read: భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్.. ఇకపై వీసా లేకుండానే ప్రయాణం!

ఆర్కిటిక్‌లో రష్యా, చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా చేపడుతున్న ఈ చర్యలు ఎంతో కీలకమని తెలిపారు. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన అనంతరం ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ద్వీపాన్ని డెన్మార్క్‌కు దూరం చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం గ్రీన్‌లాండ్ ప్రజలకు డబ్బును ఎరగా వేయాలని ట్రంప్ యంత్రాంగం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఒక్కో వ్యక్తికి 10 వేల నుంచి లక్ష డాలర్లు (రూ.8 లక్షల నుంచి రూ.89 లక్షలు) డబ్బు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. 

Also Read: అమెరికా, ఉక్రెయిన్‌లకు బిగ్ షాక్.. అగ్రరాజ్యం ఫైటర్ జెట్లు కూల్చేసిన రష్యా!

అయితే అమెరికా నగదు చెల్లింపు ప్లాన్‌ను గ్రీన్‌లాండ్‌ నాయకులు రిజెక్ట్ చేశారు. గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్‌ ఫ్రెడరిక్ కూడా దీనిపై స్పందించారు. తమ భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని తేల్చిచెప్పారు. నాటో దేశాలు సైతం అమెరికా ప్లాన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి గ్రీన్‌లాండ్ ద్వీపంలో కేవలం 57 వేల మంది మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. తాజాగా అమెరికా దీన్ని స్వాధీనం చేసుకునేందుకు బిల్లు ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Advertisment
తాజా కథనాలు