USA: ఆ భారత విద్యార్థిని పంపించొద్దు..అమెరికా న్యాయస్థానం

హమాస్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్ట్ అయిన భారతీయ విద్యార్థి బాదర్ ఖాన్ సురిని అమెరికా నుంచి బహిష్కరించొద్దని ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ వర్జీనియా కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇతను వర్జీనియాలోని పోలీసులు అదుపులో ఉన్నాడు.  

New Update
Indian Student arrested america

Indian Student arrested america Photograph: (Indian Student arrested america)

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. హమాస్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బదర్ ఖాన్ సురి అనే విద్యార్థిని ఫెడరల్ ఏజెంట్లు అరెస్టు చేశారు. బదర్‌ ఖాన్  జార్జ్‌ టౌన్‌ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా ఉన్నాడు. వర్జీనియాలో బదర్ ఖాన్‌ను ఫెడరల్‌ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఖాన్ స్టూడెంట్ వీసాను అమెరికా రద్దు చేసింది. అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ సురి ఇమ్మిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశాడు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని.. భార్య పాలస్తీనా మూలాలు ఉండటంతోనే అరెస్టు చేశారని బదర్ ఖాన్ సురి ఆరోపించాడు. 

అతనిని పంపించొద్దు..

పోస్ట్‌ డాక్టోరల్‌గా ఉన్న బదర్‌ ఖాన్‌ సురి  విశ్వవిద్యాలయంలో హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఆరోపించారు. ఇతనిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా..వీసాను కూడా రద్దు చేశారు. దీనిని సవాల్ చేస్తూ సురి ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ వర్జీనియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన కోర్టు అతనికి తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. న్యాయస్థానం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు బదరీ ఖాన్ ను దేశం నుంచి పంపించకూడదని ఆదేశించింది. ప్రస్తుతం సురిని లూసియానాలోని ఇమిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచినట్లు అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియస్‌ చెప్పింది. 

స్టూడెంట్ వీసా మీద వెళ్లి..

బదర్ ఖాన్ సూరీ 2020లో శాంతి, సంఘర్షణ అనే అంశంపై ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌‌డీ చేశారు. ఆ తర్వాత స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లి అక్కడ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరిల్ ఫెలో, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతిని నెలకొల్పే అంశంపై పరిశోధనలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇతని భార్య గాజాకు చెందినది. ఈమెకు అమెరికా పౌరసత్వం ఉండటంతో అక్కడే చదువుతోంది. 

 

Also Read: IPL 2025: రేపటి నుంచే ఐపీఎల్.. నాలుగు కొత్త రూల్స్ తో..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు