/rtv/media/media_files/2025/09/02/russia-oil-2025-09-02-16-47-16.jpg)
Russia oil
అమెరికా అధ్యక్షుడి ఆర్థిక సలహాదారు పీటర్ నవారో భారతదేశంపై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం లాభాపేక్ష కోసమేనని ఆయన ఆరోపించారు. రష్యా డబ్బును లాండరింగ్ చేయడానికి భారత్ ఒక సాధనంగా మారిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై భారత ప్రభుత్వం గట్టిగా సమాధానం ఇచ్చింది. నవారో చేసిన వ్యాఖ్యలపై భారత్‌లోని రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ఈ ఆరోపణలను తిరస్కరించారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంలో ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని.. ఈ వ్యాపారం ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించడానికి మరియు ధరలను అదుపులో ఉంచడానికి సహాయపడిందని ఆయన చెప్పారు.
నవారో విమర్శలు:
నవారో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..బ్రాహ్మణులు మిగిలిన భారత ప్రజల ఖర్చుతో లాభాలు పొందుతున్నారు. ఇది తక్షణమే ఆపాలని భారత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా ఆయన భారత్‌పై ఇలాంటి ఆరోపణలు చేశారు. భారతదేశం సుంకాల విషయంలో అత్యధిక సుంకాలను విధిస్తోందని.. అమెరికా నుంచి వస్తువుల దిగుమతిని అడ్డుకుంటోందని ఆరోపించారు. భారత చమురు శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చౌకగా చమురు కొని.. దాన్ని శుద్ధి చేసి అధిక ధరలకు అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముతున్నాయి. ఈ లాభాలు రష్యాకు యుద్ధానికి నిధులు సమకూర్చడానికి ఉపయోగపడుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూర్చడం వల్ల ఈ యుద్ధం మోదీ యుద్ధంగా మారిందని నవారో ఆరోపించారు. రష్యా నుంచి ఆయుధాలు కొంటూ అదే సమయంలో అమెరికా నుంచి రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని కోరడంపై నవారో విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: ఎంప్లాయితో సంబంధం.. నెస్లే సీఈఓ పై వేటు
నవారో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ రష్యా చమురును కొనుగోలు చేయడం G7 దేశాలు విధించిన ధరల పరిమితి విధానాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ విధానం రష్యా ఆదాయాన్ని పరిమితం చేస్తూనే చమురు సరఫరాను కొనసాగించడానికి ఉద్దేశించబడింది. పూరి తన వ్యాసంలో.. భారత కొనుగోళ్లు లేకపోతే.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింత పెరిగేవి.. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం జరిగేదని పేర్కొన్నారు. భారత్ ఎప్పటినుంచో పెట్రోలియం ఉత్పత్తులను ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందని.. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా ఎగుమతి పరిమాణాలు, లాభాల మార్జిన్లు మారలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా నవారో వ్యాఖ్యలను ఆధార రహితంగా అభివర్ణించారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు అమెరికాలో భారత్ గురించిన కథనాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో సూచిస్తున్నాయని పేర్కొన్నారు. నవారో వ్యాఖ్యలు అమెరికా-భారత్ సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇది వాణిజ్యం, భౌగోళిక రాజకీయాల గురించి రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను మరింత స్పష్టం చేసింది. భారత్ తమ దేశీయ అవసరాలను తీర్చడానికి.. ప్రపంచ చమురు మార్కెట్‌ను స్థిరీకరించడానికి రష్యాతో వ్యాపారం కొనసాగిస్తోందని.. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని గట్టిగా చెబుతోంది.
ఇది కూడా చదవండి: భారత పర్యటనలో జర్మన్ విదేశాంగ మంత్రి వాడేఫుల్..ఎందుకొచ్చారంటే..