/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)
H1B Visa
అమెరికాకు వెళ్ళే వారిలో ఎక్కువ మంది హెచ్ 1 బీ వీసాదారులే ఉంటారు. దీని కాలపరిమితి ఏడేళ్ళు ఉంటుంది. ఒక్కో దేశానికి ఏడాదికి ఎన్ని హెచ్ 1బీ వీసాలు ఇవ్వాలనేది అమెరికా కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అది 85,000గా ఉంది. వీటిల్లో 20,000 వీసాలు మాస్టర్స్ డిగ్రీ ఉన్న వర్కర్ల కోసం రిజర్వు చేశారు. అయితే ఫ్యూచర్ లో వీసాల జారీ మార్పులు చేయాలని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ భావిస్తోంది. దానికి అణుుణంగా వైట్ హౌస్ కు రివ్యూలు కూడా పంపిందని చెబుతున్నారు.
జీతం, పొజిషన్ ఆధారంగా..
ప్రస్తుతం 2026 వీసాల జారీ ప్రక్రియ నడుస్తోంది. దీని కోసం తగినన్ని అప్లికేషన్లు ఇప్పటికే వచ్చాయి. అయితే ఇప్పుడు ఈప్రసెస్ ను నిలిపివేసినట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. దీని ప్రకారం 2026 ఏడాది హెచ్ 1 బీ లాటరీ పద్ధతి ఉండదు. పరిమితి ఆధారంగా జీతాలు, పొజిషన్ ను బట్టి లాటరీ తీస్తారని తెలుస్తోంది. దీని ద్వారా ఉన్నత స్థాయి నిపుణులను మాత్రమే నియమించుకునే అకాశం ఉంటుందని చెబుతున్నారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇదే పద్ధతిని అమలు చేశారు. బై అమెరికన్, హైర్ అమెరిక్ అనే విధానం ద్వారా తక్కువ శ్రేణి జీతాలున్న పొజిషన్లలో విదేశీయుల నియామకాలను నియంత్రించేందుకు ప్రయత్నించారు. తర్వాత బైడెన్ వచ్చాక దాన్ని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిని వెనక్కు తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రపోజల్ ను డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ రివ్యూ కోసం వైట్ హౌస్ కు పంపించింది. ఇది కనుక అప్రూవ్ అయితే జీతం, హోదా, పొజిషన్ బట్టి వీసాలను జారీ చేస్తారు.
ఇది కూడా చూడండి:Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!