Ind-Pak: పాకిస్తాన్ కు మరో షాక్..ఫ్లైట్స్ ఎంట్రీకి నో

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చర్యలు తీసుకుంటూనే ఉంది. యుద్ధ సన్నాహాలను ఒకవైపు నుంచి చేస్తూనే మరోవైపు ఆ దేశంపై ఆంక్షలను విధిస్తోంది. తాజాగా భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాలను నిషేధించింది. 

New Update
india

No Entry For Pak flights

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తత తీవ్రతరం అవుతోంది. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఐదు పెద్ద నిర్ణయాలతో పాక్ ను ముప్పేట కట్టడి చేసిన భారత్...తాజాగా మరో పెద్ద నిర్ణయంతో ఆ దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి రావడానికి వీలు లేదంటూ నిషేధాజ్ఞలను జారీ చేసింది. ఏప్రిల్ 30 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పింది. పాకిస్తాన్ కు నోటీసు టు ఎయిర్ మిషన్స్  జారీ చేసి..పాకిస్తాన్ రిజిస్టర్డ్, ఆపరేటడ్, ఓన్డ్ లేదా లీజ్డ్ విమానాలు అన్నీ ప్రవేశానికి అనుమతి లేదని చెప్పేసింది. 

పెరుగుతున్న ఖర్చు..

పాకిస్తాన్ అంతకు ముందే భారత విమానాలను నిషేధించింది. అందువల్లనే భారత్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వలన పాక్ ఫ్లైట్ చైనా లేదా శ్రీలంక మీదుగా వెళ్ళాల్సి వస్తుంది. ఉత్తర భారత నగరాల నుండి పశ్చిమ దేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాల మార్గాలపై పాకిస్తాన్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నిషేధం వల్ల భారత విమానయాన సంస్థలకు వారానికి రూ.77 కోట్లు, నెలకు రూ.306 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఉత్తర అమెరికా విమానాలు 1.5 గంటల ఆలస్యం అవుతున్నాయి, ప్రతి విమానానికి రూ.29 లక్షలు అదనపు ఖర్చు అవుతోంది.
యూరోపియన్ మార్గాలకు కూడా ఇదే పరిస్థితి, ప్రతి విమానానికి రూ.22.5 లక్షలు అదనపు ఖర్చు అవుతోంది.దీంతో పాటూ భారత ఓడ రేవుల్లో కూడా దాయాది ఓడలను నిలిపేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తోంది. 

today-latest-news-in-telugu

Also Read: Delhi: ఢిల్లీ హాట్ లో భారీ అగ్నిప్రమాదం...

#pakistan #india #flights #today-latest-news-in-telugu
Advertisment
తాజా కథనాలు