Modi-Putin Car Selfie: కారులో మోదీ-పుతిన్ సెల్ఫీ..అమెరికాలో రాజకీయ దుమారం

రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన అమెరికాలో తీవ్ర సంచలనం రేపింది. దాంతో పాటూ అమెరికా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి కూడా తీసింది. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రధాని మోదీ, పుతిన్ కారులో తీసుకున్న సెల్ఫీ అయితే అక్కడ రాజకీయాల్లో కూడా కలకలం రేపుతోంది. 

New Update
car selfie

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన్ను ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నారు భారత ప్రధాని మోదీ. ఆ తరువాత వారిద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. ఈ టైమ్ లో ఒక సెల్ఫీ కూడా తీసుకున్నారు. దీని తరువాత ఆ కారు ప్రయాణం గురించి పుతిన్ చెబుతూ..ఆ కారు రైడ్ నా ఆలోచన. మా స్నేహానికి చిహ్నం. ఆ సమయంలో మేం మాట్లాడుతూనే ఉన్నాం. చర్చించుకోవడానికి ఎప్పుడూ ఏదోఒక అంశం ఉంటుంది అని కూడా అన్నారు.  ఇప్పుడు ఇదే అమెరికా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అమెరికా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.  ఒక్క చిత్రం ఎన్నో అర్థాల్ని చెబుతోందంటూ అమెరికా చట్టసభ సభ్యురాలు సిడ్నీ కమ్‌లాగర్ దువ్ హెచ్చరించారు. భారత్, అమెరికాల మధ్య మధ్య వ్యూహాత్మక విశ్వాసం, పరస్పర అవగాహనను దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అమెరికాకే చేటని ఆమె అన్నారు. యూఎస్ ను వ్యూహాత్మక భాగస్వాములను శత్రువుల చేతిలోకి నెట్టడం ద్వారా మీకు నోబెల్ రాదు అంటూ ట్రంప్ ను ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుంటే మంచిదని కమ్లాగర్ హితవు పలికారు.

భారత్ వ్యూహాత్మక భాగస్వామని మర్చిపోకూడదు..

ఇక భారత్ తో అమెరికాపై ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకతే వ్యక్తం అవుతోంది. టారిఫ్ ల వలన ఇండియా ఒక్కటే కాదు అమెరికా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. అవి భారత ఆర్థిక వ్యవస్థను, అమెరికా వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు మరో చట్ట సభ్యరాలు ప్రమీలా జయపాల్. అబ్జర్వర్ రిసెర్చ్‌ ఫౌండేషన్ అమెరికా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధ్రువ జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ సైనిక నాయకత్వంపై ట్రంప్ యంత్రాంగం చూపుతోన్న అభిమానాన్ని ప్రశ్నించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోసే పాక్‌తో ఇలాంటి సంబంధాలను ఆయన వ్యతిరేకించారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని మరో చట్టసభ సభ్యుడు బిల్ హుయిజెంగా అన్నారు. అలాంటి దేశాన్ని దూరం పెట్టడం మంచిది కాదని చెప్పారు.  భారత్‌-అమెరికా దేశాల సంబంధాలు వ్యాపారపరమైనవి మాత్రమే కాదు వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా అంటూ.. హౌస్‌ ఫారిన్‌ అఫైర్స్‌ సౌత్‌ అండ్ సెంట్రల్ ఏషియా సబ్‌ కమిటీ ముందు వీరు తమ ఆందోళనలను వ్యక్తంచేశారు.

Advertisment
తాజా కథనాలు