USA: సంపన్న వలసదారులకు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత క్రేజీ మనందరం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన మరో క్రేజీ ఆఫర్ ప్రకటించారు. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో వీసా పాలసీని మర్చి దాని స్థానంలో గోల్డ్ కార్డ్ తీసుకురానున్నట్లు తెలిపారు. 

author-image
By Manogna alamuru
New Update
Donald Trump

Donald Trump

సంపన్న వలసదారులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమెరికాలో పెట్టుబడి పెట్టే ఇతర దేశస్థుల సంపన్నులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. అక్కడ పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ళుగా అమల్లో ఉన్న వీసా పాలసీను మార్చే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. దాని స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాలను తీసుకువస్తామని తెలిపారు. ఈ వీసాలతో ఇన్వెస్టర్లు అమెరికా పౌరసత్వం పొందడం ఈజీ అవుతుందని చెప్పారు. అయితే దీని కోసం 5 మిలియన్ డాలర్లు మాత్రం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 

5 మిలియన్లకు గోల్డ్ కార్డ్..

ఈ గోల్డ్ కార్డుల ద్వారా అమెరికాకు ఫైనాన్స్ ఉన్న లోటును పూరించవచ్చని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. సమారు ఒక మిలియన్ గోల్డ్ కార్డులు ఇస్తామని తెలిపారు. దీంతో వచ్చిన మొత్తంతో అమెరికాలో ఉద్యోగాలు సృష్టించవచ్చని చెబుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులను శాశ్వత నివాసితులుగా మార్చడానికి అనుమతించే "EB-5" వలస పెట్టుబడిదారు వీసా కార్యక్రమాన్ని "గోల్డ్ కార్డ్"తో భర్తీ చేస్తామని ట్రంప్ చెప్పారు. దీని ద్వారా ధనవంతులు తమ దేశంలోకి వస్తారని అన్నారు. అంతేకాదు అమెరికా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తొందరలోనే చెబుతామని  తెలిపారు.  ఇది రష్యన్లతో సహా అన్ని దేశాల వారికీ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. EB-5 ప్రోగ్రామ్‌ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నామన్నారు ట్రంప్. చట్టబద్ధంగా రావాలనుకున్న ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. 

అసలేంటీ EB-5..

అమెరికాలో వ్యాపారం చేయాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా లేదా తొందరగా గ్రీన్ కార్డ్ రావాలంటే ఈబీ 5 వీసా ఉండాలి. దీని ద్వారా గ్రీన్ కార్డ్ చాలా తొందరగా వచ్చేస్తుంది. దీనిని 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం గణాంకాల ప్రకారం 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ ఇన్వెస్టర్‌ వీసాలను పొందారు. అయితే దీని వలన మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులను పొందుతున్నారని తెలిసింది. వీటిని అరికట్టాలంటే దీన్ని మొత్తం తీసేయాలని ట్రంప్ అంటున్నారు. అలాగే ఇప్పుడు ప్రవేశపెడుతున్న గోల్డ్ కార్డ్ విధానం ఏమీ కొత్తది కాదని..ఇప్పటికే 100 దేశాలకు మంచి వీటిని జారీ చేస్తున్నాయని చెప్పారు. యూకే, స్పెయిన్‌, గ్రీస్‌, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయన్నారు. ఈబీ5 స్థానంలో తీసుకువస్తున్న గోల్డ్ కార్డ్ కు ఎలాంటి పరిమితులు ఉండవని తెలిపారు. 

 

Also Read: Maha Kumbh: కుంభమేళాలో మహా శివరాత్రి అద్భుతం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు