Maha Kumbh: కుంభమేళాలో మహా శివరాత్రి అద్భుతం

మహా శివరాత్రి సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. శివలింగం ఆకారంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో లక్షలాది మంది భక్తులు స్నానాలు చేస్తున్న డ్రోన్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. 

New Update
UP

Maha Kumbh Snan On Maha Sivaratri

జనవరి 16న ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమైన మహా కుంభమేళా ఇవాల్టితో ముగియనుంది. ఇప్పటివరకు దాదాపు 65 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు. అయితే ఇప్పటి వరకు కుంభమేళా ఒక ఎత్తు...ఈరోజు తెల్లవారు ఝామున జరిగింది ఒక ఎత్తు. ఈరోజు మహా శివరాత్రి. దీన్ని పురస్కరించుకుని కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారు ఝామున బ్రహ్మ ముహూర్తంలో త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు. శివలింగం ఆకారంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. దీని తాలూకా విజువల్స్ ను డ్రోన్ల ద్వారా చిత్రీకరించారు. అవి అద్భుతంగా ఉండి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. 

Also Read: SLBC Tunnel: బండరాళ్ళు అడ్డుగా ఉన్నాయి...గుర్తించిన ర్యాట్ హోల్ మైనర్లు

Advertisment
తాజా కథనాలు