USA: పత్రాల్లేవని కుక్కను చంపి ఫ్లైట్ ఎక్కింది

కుక్కలకున్న విశ్వాసం మనుషులకు ఉండదు అంటారు. అది నిజమేనని నిరూపించింది అమెరికాలోని అలిసన్ లారెన్స్ అనే ఆమె. పత్రాలు లేక కుక్కను ఫ్లైట్ లో తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పారని ఏకంగా దాన్నే చంపేసింది ఫ్లైట్ ఎక్కేసింది. 

New Update
usa

woman killed pet dog

తెల్లటి షనాసర్ జాతికి చెందిన బుజ్జి కుక్క తో కొలంబియా వెళ్ళడానికి బయలుదేరింది అలిసన్ లారెన్స్. ఫ్లోరిడా నుంచి ట్రావెల్ చేస్తోంది. అయితే విమానాశ్రయంలో ఆమెను అక్కడి అధికారులు అడ్డుకున్నారు. పెంపుడు జంతువులను విమానాల్లో తీసుకెళ్ళాలంటే దానికి కూడా టికెట్ ఉండాలి. దాంతో పాటూ అనుమతి పత్రాలు కూడా ఉండాలి. అయితే అలిసన్ దగ్గర ఆమె పెట్ కు సంబంధించిన పత్రాలు లేవు. దీంతో ఎయిర్ పోర్ట్ లో అధికారులు అలిసన్ ను అడ్డుకున్నారు. తన పెట్ డాగ్ ను పట్టుకెళ్ళడానికి వీలు లేదని చెప్పేశారు. 

దారుణమైన పని చేసి..

ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ దీని తర్వాత అలిసన్ చేసిన పనే అసలు ఆమె మనిషేనా అనాలనిపించేట్టుగా ఉంది. ఎయిర్ పోర్ట్ లో కుక్కను అనుమతించమని చెప్పగానే అలిసన్ దానిని తీసుకుని బాత్‌రూంలోకి వెళ్ళింది. అక్కడ ఆ పెట్ ను నీటిలో ముంచి నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఆ తరువాత అక్కడే ఉన్న చెత్త బుట్టలో పడేసి...ఏమీ తెలియనట్టు వచ్చి ఫ్లైట్ ఎక్కేసింది. తాను వెళ్ళాల్సిన కొలంబియా కూడా చేరుకుంది. అయితే బాత్‌రూం క్లీన్ చేయడానికి వెళ్ళిన వర్కర్ కు చెత్త బుట్టలో కనిపించింది. దాంతో మొత్తం విషయం బయటపడింది. అలిసన్ అంతా బాగానే చేసింది కానీ కుక్క మెడకు ఉన్న కాలర్ తీయడం మర్చిపోయింది. దాని మీద ఆమె ఫోన్ నంబర్, పేరుతో సహా అన్ని వివరాలు ఉన్నాయి. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులు సులువుగానే అలిసన్ ను పట్టుకోగలిగారు. సీసీ కెమెరాలను కూడా చూసి ఆమేనని నిర్ధారించుకున్నారు. ఆ ఆధారాలతో ఇల్లినోయీలోని లేక్‌కౌంటీలో జంతుహింస నేరం కింద ఆమెను అరెస్టు చేశారు. ఇంతా చేస్తే అలిసన్ వయసు తక్కవు, ఆవేశంలో ఏదో చేసింది అనడానికి కూడా లేదు. ఆమె వయసు 57 ఏళ్ళు. 

today-latest-news-in-telugu | woman | pet-dog | killed

Also Read: CBI: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు క్లోజ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు