Russia-Ukraine War: రష్యాపై ఉక్రెయిన్‌ భీకర దాడులు

తాజాగా ఉక్రెయిన్‌.. రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాలోని ఓరెన్‌బర్గ్‌ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద గ్యాస్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌పై దాడులు చేసింది.

New Update
Ukraine Targets Orenburg Gas Plant In Latest Long-Range Strike

Ukraine Targets Orenburg Gas Plant In Latest Long-Range Strike

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఎన్ని ప్రయత్నాలు జరిగినా అవి ఫలించడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌.. రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాలోని ఓరెన్‌బర్గ్‌ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద గ్యాస్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌పై దాడులు చేసింది. కీవ్‌కు తూర్పువైపున 1700 కిలోమీటర్ల మేర ఉక్రెయిన్‌ బలగాలు చొచ్చుకొచ్చి మరీ ఈ దాడులు చేశాయి. 

Also read: ట్రంప్ అధ్యక్ష పదవికి గండం? వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి..

ఈ దాడి వల్ల గ్లాస్‌ ప్లాంట్లలో ఓ యూనిట్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఆ తర్వాత రష్యన్ సిబ్బంది వీటిని ఆర్పేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరికీ గాయాలు కాలేదని ఆ ప్రాంత గవర్నర్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్ దాడి చేసిన ప్రదేశం జనావాసాలకు అతిదగ్గరగా ఉందని ఆరోపించారు. 

Also Read :  మేము దాడి చేయకపోతే..25వేల మంది చనిపోయేవారు..జలాంతర్గామి దాడిపై ట్రంప్ సమర్ధన

ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని సుదూర ప్రాంతాల్లో కూడా దాడులు చేస్తున్నాయి. సెప్టెంబర్‌లో దాదాపు 2 వేల కిలోమీటర్ల మేర లోపలికి దూసుకెళ్లి మరి ఇలాంటి దాడులకు పాల్పడ్డ ఘటనలున్నాయి. దీంతో రష్యా ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌కు ఇది సవాలుగా మారింది.  సైబీరియా, ఊరల్ పర్వతాల్లోని గ్యాస్‌ ప్లాంట్లను ఉక్రెయిన్‌ బలగాలు టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా సమర ప్రాంతంలో కూడా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. 

Advertisment
తాజా కథనాలు