Russia-Ukraine War: మళ్లీ మొదలైన యుద్ధం.. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి

రష్యాకు ఉక్రెయిన్ బిగ్ షాక్ ఇచ్చింది. శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాకు చెందిన కుర్క్స్‌ అణు కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. న్యూక్లియర్‌ టెర్మినల్స్‌ను డ్రోన్లు తాకాయి. దీంతో అక్కడ ఉత్పుత్తులు నిలిచిపోయాయి.

New Update

రష్యాకు ఉక్రెయిన్ బిగ్ షాక్ ఇచ్చింది. శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాకు చెందిన కుర్క్స్‌ అణు కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. న్యూక్లియర్‌ టెర్మినల్స్‌ను డ్రోన్లు తాకాయి. దీంతో అక్కడ ఉత్పుత్తులు నిలిచిపోయాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుకు కుర్క్స్‌ అణు విద్యుత్ కేంద్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపాలని అమెరికా ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ రష్యా-ఉక్రెయిన్‌లు మాత్రం పరస్పర దాడులు చేసుకోవడం కలకలం రేపుతోంది.  

Also Read: నోయిడా కేసులో బిగ్ ట్విస్ట్.. వరకట్న మర్డర్‌ నిందితునిపై పోలీసుల కాల్పులు

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దీనిపై ఇంకా సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అలస్కాలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్రంప్.. జెలెన్‌స్కీతో కూడా సమావేశమై పలు అంశాల గురించి చర్చించారు. అయినా కూడా యుద్ధం ముగింపుపై ఇరుదేశాల మధ్య కొలిక్కి రాలేదు. మరోవైపు ఉక్రెయిన్‌ తమ ఎయిర్‌ఫోర్స్‌ సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి 3,350కి పైగా ఎక్స్‌టెండెడ్‌ రేంజ్ అటాక్ మ్యూనిషన్ మిసైల్స్‌ను అందించేందుకు డొనాల్డ్ ట్రంప్‌ ఆమోదం తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.  

Also Read: అనిల్‌ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. రూ.2929 కోట్ల బ్యాంక్ మోసం కేసులో సీబీఐ సోదాలు

Advertisment
తాజా కథనాలు