/rtv/media/media_files/2026/02/20/trump-and-khameni-2026-02-20-10-29-06.jpg)
Trump and Khameni
UK: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరుదేశాల్లో సందిగ్ధత వీడటం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. మరో 10 రోజుల్లో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోకుంటే ఇరాన్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ అంశంలో రాజీకి రాకుంటే సైనిక చర్య తప్పదంటూ తేల్చిచెప్పారు. దీంతో ఇరాన్‌పై దాడులు చేసేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
అమెరికా ఇరాన్‌పై దాడులు చేసేందుకు ముందుగా యూకే ఎయిర్‌బేస్‌ను సాయం అడిగింది. కానీ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సర్కార్ అమెరికా అభ్యర్థనను తిరస్కరించింది. డియాగో గార్షియా, RAF వైమానిక స్థావరాల నుంచి ఈ దాడులు చేసేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా చేయడం ఇంటర్నేషనల్ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందనే కారణంతో దీన్ని రిజెక్ట్ చేసింది.
Also Read: విభిన్న వాతావరణం.. ఉత్తర భారత్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు, దక్షిణాదికి వర్షాలు
వాస్తవానికి 2001 తర్వాత యూకే విధానంలో కీలక మార్పులు వచ్చాయి. మిత్రదేశానికి చట్టవిరుద్ధ దాడికి సహకరిస్తే బ్రిటన్ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌పై దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వడంలో బ్రిటన్ అలెర్ట్‌గా ఉంటోంది. గతంలో కూడా అమెరికా ఇరాన్‌పై దాడులు చేసినప్పుడు యూకే నేరుగా పాల్గొనలేదు. కేవల రక్షణ చర్యల్లో మాత్రమే సహకరించింది.
యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో విమర్శలు చేశారు. చాగోస్ దీవులపై నియంత్రణను వదులుకోవద్దని హెచ్చరించారు. ప్రమాదకరమైన పాలన ద్వారా జరిగే దాడిని అడ్డుకునేందుకు అమెరికాకు డియెగో గార్షియా, RAF ఎయిర్‌బేస్ అవసరం కావొచ్చని హెచ్చరించారు. అమెరికా దీర్ఘదూర ఆపరేషన్లకు డియాగో గార్షియా అనేది కీలక ఎయిర్‌బేస్‌గా ఉంది.
Also Read: పురిటినొప్పులు భరించలేక.. పొత్తికడుపు కోసుకుంది.. చివరకు ఏమైందంటే?
మరోవైపు అమెరికా ఇరాన్ ముందు మూడు ప్రతిపాదనలు చేసింది. ఒకటి ఇరాన్ తమ యూరేనియం శుద్ధిని పూర్తిగా ఆపేయాలి. రెండవది ఇరాన్ అభివృద్ధి చేస్తున్న బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను వదులుకోవాలి. మూడోవది పశ్చిమాసియాలో తీవ్రవాద గ్రూపులకు సపోర్ట్ చేయకూడదు. ఇదిలాఉండగా ట్రంప్ క్షేత్రస్థాయిలో కూడా దూకుడు ప్రదర్శించారు. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకను పశ్చిమాసియాకు పంపించారు. అలాగే యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ఫోర్డ్ యుద్ధ విమాన వాహక నౌక కూడా అక్కడికి చేరుకుంటోంది. ఇప్పటికే 50కి పైగా అత్యాధునిక ఫైటర్ జెట్లు, ఇంధన ట్యాంకర్లను అమెరికా రెడీ చేసింది. ఇరాన్లో అణు ఏ క్షణమైనా దాడులు చేసేలా ఇప్పటికే వైమానిక దళాలకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
Follow Us