/rtv/media/media_files/2026/02/10/trump-2026-02-10-15-56-32.jpg)
Trump threatens to block US–Canada Gordie Howe bridge
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కెనడాకు సంచలన హెచ్చరిక చేశారు. ఇప్పటిదాకా అమెరికా నుంచి పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా తమకు తిరిగి మూల్యం చెల్లించాలన్నారు. లేకుంటే కఠినంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పూర్తి పరిహారం చెల్లించేదాకా కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌ను అమెరికాలో మిచిగాన్‌తో కలిపే గోర్డీ హోవే ఇంటర్నేషనల్ వంతెనను బ్లాక్ చేస్తామంటూ హెచ్చరించారు. 2014లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలివితక్కువగా ఆలోచించి ఈ బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన మినహాయింపులు ఇచ్చారని ట్రంప్ విమర్శలు చేశారు.
Also Read: మాజీ ఆర్మీ చీఫ్ నరవణే బుక్ వివాదం.. ఆ బుక్‌లో ఏముందో తెలుసా ?
బ్రిడ్జి నిర్మాణానికి అయిన ఖర్చులో సగమైనా అమెరికాకు చెల్లించాలని లేదా బ్రిడ్జిపై ఇరుదేశాలకు సమాన యాజమాన్య హక్కులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కెనడాకు సూచనలు చేశారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా, కెనడా మధ్య ఇటీవల తలెత్తిన విభేదాల గురించి ట్రంప్ మాట్లాడారు. చాలాఏళ్ల నుంచి అమెరికా నుంచి పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు కెనడా వసూలు చేస్తున్న సుంకాలు ఆమోదయోగ్యంగా లేవంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడా.. అమెరికాతో కాకుండా చైనాతో వ్యాపారం చేసేందుకు మొగ్గు చూపడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనికి వాళ్లు మూల్యం చెల్లించుకుంటారంటూ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్
ఆ వంతెన ప్రాజెక్టుకు సంబంధించిన వెబ్‌సైట్ ప్రకారం చూసుకుంటే డెట్రాయిట్ నదిపై ఏర్పాటు చేసిన గోర్డీ హోవే అనే ఇంటర్నేషనల్ బ్రిడ్జిని కెనడియన్ ప్రభుత్వానికి చెందిన విండ్సర్‌డెట్రాయిల్ బ్రిడ్జ్ అథారిటీ అనే కంపెనీ నిర్మించింది. దీని నిర్మాణానికి అక్కడి ప్రభుత్వమే నిధులు ఇచ్చింది. ఈ ఏడాదిలోనే దాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా ట్రంప్ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ట్రంప్ హెచ్చరికపై కెనాడా ఇంతవరకు స్పందించలేదు.
Follow Us