Srilanka: శ్రీలంకలో ప్రధాని మోదీ.. 11 మంది భారత జాలర్లు విడుదల

శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు కుమార దిసనాయకేతో సమావేశం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా భారత్‌కు చెందిన 11 మంది జాలర్లను శ్రీలంక విడుదల చేసింది.

New Update
Pm Modi and Sri Lanka Releases 11 Indian Fishermen As Special Gesture

Pm Modi and Sri Lanka Releases 11 Indian Fishermen As Special Gesture

భారత్, శ్రీలంక మధ్య మత్స్యకారుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతుంటాయి. తమ జలాల్లోకి వచ్చారని భారత జాలర్లను శ్రీలంక నౌకదళ సిబ్బంది అరెస్టు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇటీవల ప్రధాని మోదీ తన శ్రీలంక పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య మత్స్యకారుల వివాదాలపై పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.  ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా భారత్‌కు చెందిన 11 మంది జాలర్లను శ్రీలంక విడుదల చేసింది. 

Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు కుమార దిసనాయకేతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యూఏఈతో కలిసి ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, పవర్‌గ్రిడ్ ద్వారా అనుసంధానత వంటి ఒప్పందాలు చేసుకున్నారు. శ్రీలంక నిర్బంధంలో ఉన్న భారత మత్స్యకారుల్ని అలాగే వాళ్ల పడవలను విడుదల చేయాలని ప్రధాని మోదీ కోరారు.   

అలాగే శనివారం దిసనాయకేతో కలిసి అనురాధపురలో జయశ్రీ మహాబోధిని సందర్శించారు. ఆ తర్వాత మహో ఒమన్‌తాయ్‌ల మధ్య అప్‌గ్రేడ్‌ చేసినటువంటి రైల్వే్లైన్‌ను దిసనాయకేతో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత భారత్‌కు బయలుదేరారు. శ్రీలంక పర్యటన ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తోందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 

Also Read: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!

ఇదిలాఉండగా శ్రీలంక నుంచి తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ విమానంలో నుంచే రామసేతును సందర్శించారు. ఎక్స్‌లో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. '' శ్రీలంక నుంచి వస్తుండగా రామసేతును దర్శించే భాగ్యం కలిగింది. అయోధ్యలో బాలరాముడికి సూర్య తిలకం జరిగినప్పుడే ఇది జరగడం విశేషం. ఈ రెండింటిని చూసే అదృష్టం నాకు దక్కిందని'' ప్రధాని మోదీ రాసుకొచ్చారు.

rtv-news | india | srilanka

Advertisment
Advertisment
తాజా కథనాలు