/rtv/media/media_files/2025/07/07/arrest-2025-07-07-20-50-07.jpg)
acb officials- arrested- miryalaguda- deputy -tahashildar
అమెరికాలో అక్రమ వలసదారులే(illegal immigrants america) టార్గెట్‌గా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE)(ICE Crackdown) అధికారులు చేపట్టిన ఆపరేషన్ తీవ్రరూపం దాల్చుతోంది. మిన్నెసోటా రాష్ట్రంలో జరుగుతున్న ఈ 'మెట్రో సర్జ్' దాడుల్లో ఇటీవల ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్(Indian students detained) ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానిక భారతీయ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది.
Also Read : ఇండియా మాస్టర్ ప్లాన్.. ఈ ప్రాజెక్టులతో చికెన్ నెక్ సేఫ్!
BREAKING
— M9 USA🇺🇸 (@M9USA_) January 16, 2026
ICE reportedly detained two Indian students at an Indian restaurant in St. Louis Park yesterday afternoon.
STUDENTS, BE VERY CAREFUL. DO NOT TAKE UP ANY PART TIME JOBS THAT ARE NOT LEGALLY ALLOWED. pic.twitter.com/WmEwnAAIVf
జనవరి 8న రిచ్‌ఫీల్డ్ ప్రాంతంలోని జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విధుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులను ఐసీఈ ఏజెంట్లు ఒక్కసారిగా చుట్టుముట్టి, కిందకు తోసివేసి, బేడీలు వేసి తీసుకెళ్లారు. మొదట వీరిని అక్రమ వలసదారులుగా అనుకున్నారు. తర్వాత వారు చట్టబద్ధంగా ఉన్న విద్యార్థులని తెలిసింది. ఐసీఈ అధికారులు వీరిని గంటల తరబడి విచారించి, వారి వీసా పత్రాలను పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఈ దాడులపై మిన్నెసోటా రాష్ట్ర ప్రతినిధి మైఖేల్ హోవార్డ్ తీవ్రంగా స్పందించారు. కేవలం కలర్, మాట్లాడే భాష ఆధారంగా విద్యార్థుల పట్ల వివక్ష చూపడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. అరెస్ట్ అయిన వారిలో అమెరికన్ పౌరసత్వం ఉన్నవారు కూడా ఉండటం గమనార్హం. కేవలం అనుమానంతోనే భారతీయ మూలాలున్న విద్యార్థులపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడం 'జాతి వివక్ష' కిందకు వస్తుందని పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. - indian students in usa
Also Read : నగరాలను మింగేసే ఆయుధం.. రష్యా చేతిలో జలరాక్షసి పోసిడాన్
విద్యార్థులకు హెచ్చరికలు
ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం భారీ బహిష్కరణల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడూ తమ పాస్‌పోర్ట్, I-20 కార్డులు వెంట ఉంచుకోవాలి. వీసా రూల్స్ అతిక్రమించి క్యాంపస్ వెలుపల అనధికార పనులు చేయకూడదు. అధికారులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి. న్యాయ సహాయం కోరాలి. మిన్నెసోటాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా వంటి విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ పరిణామాలపై భారత రాయబార కార్యాలయం దృష్టి సారించి, విద్యార్థులకు అండగా నిలవాలని ప్రవాస భారతీయులు కోరుతున్నారు.
Follow Us