US-China Trade War: అమెరికా, చైనాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం..100 శాతం సుంకాలు

అరుదైన ఖనిజాల విషయంలో అమెరికాకు, చైనాకు మధ్య మళ్ళీ చెడింది. ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధిస్తే..దానికి ప్రతీకారంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంపై వంద శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. 

New Update
Trump

Trump

మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళనున్నారు. అక్కడ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఆయన భేటీ కానున్నారు.  భేటీలో చైనా లో దొరికే అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఇరు దేశాధ్యక్షులూ చర్చించాలనుకున్నారు. కానీ ఈ లోపే ఇద్దరి మధ్యా తేడాలొచ్చాయి. ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడం ట్రంప్ కు ఆగ్రహాన్ని తెప్పించ్చింది. చనా వాణిజ్యపై అసాధారణమైన దూకుడు వైఖరితో తీసుకుంటోందని ఆరోపించారు. దీన్ని అరికట్టాలంటే చర్యలు అవసరమని చెప్పారు. అందుకే చైనాపై 100 శాంత సుంకాలను విధిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. తన ట్రూత్ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పోస్ట్ పెట్టారు. 

ఇలా అయితే కలవను..

ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను కలవడం అనవసరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ సమావేశానికి తాను హాజరు కానని చెప్పారు. చైనా మొండితనంతో ఉన్నప్పుడు సమావేశంలో పాల్గొనడలో ఎటువంటి అర్ధం కనిపించడం లేదని ట్రంప్ అన్నారు. ఇది ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తోందని ట్రంప్ చెప్పారు. 

చైనా చాలా చిత్రంగా ప్రవర్తిస్తోంది. అరుదైన ఖనిజాల విషయంలో ఆంక్సలు విధిస్తోంది. ప్రపంచం మొత్తం లేఖలు పంపిస్తోంది. దీని వలన ఆ దేశానికే నష్టం...అందరూ వారికి శత్రువులుగా మారిపోతారంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. నిజానికి చైనాతో తమకు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ట్రంప్ అన్నారు. ఇప్పటికే చైనా తన ఎలక్ట్రానిక్స్, సైనిక, టెక్నాలజీ్లో పయోగించే అరుదైన ఖనిజాల ఎగుమతిని పరిమితం చేసింది. దీని వలన తాము ఇబ్బందులు పడుతున్నాము. విదేశీ కంపెనీలు ప్రత్యేక  అనుమతి పొందాల్సి వచ్చిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. దానికి తోడు ఇప్పుడు ఆంక్షలు విధిస్తోంది. ఇలా అయితే అందరికీ కష్టం అవుతుందని ట్రంప్ అన్నారు.   

కుప్పకూలిన స్టాక్ మార్కెట్..

ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లలో పెద్ద ఎఫెక్ట్ కనిపించింది. శుక్రవారం నాడు అమెరికాలోని  S&P 500 2.7% పడిపోయింది. ఏప్రిల్ తర్వాత S&P ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలుగుతుందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వలన అమెరికాలోని పరిశ్రమలు, సప్లై చైన్స్ ను భారీగా దెబ్బతింటాయని అంటున్నారు. 

Also Read: Tennessee Blast: అమెరికాలో టెన్నిసీలో భారీ పేలుడు..19మంది మృతి

Advertisment
తాజా కథనాలు