/rtv/media/media_files/2025/09/10/trump-double-game-with-allies-2025-09-10-15-35-12.jpg)
Trump: ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిత్రదేశాలతో ఆయన వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయంశంగా మారుతోంది. మిత్రదేశంగా చెప్పుకుంటూనే మనదేశంపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ మరో మిత్ర దేశం ఖతార్ విషయంలోనూ అదే గేమ్ షురూ చేశాడు. హమాస్ నేతలను అంతమొందిస్తామని చెప్తూ ఇజ్రాయెల్ ఖతార్ రాజధాని దోహాపై వైమానిక దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. గాజాలో కాల్పుల విరమణ విషయంలో అమెరికా చేసిన ప్రతిపాదనపై ఒకవైపు చర్చలు జరుగుతుండగా మరోవైపు ఈ దాడులు జరగడం గమనార్హం. అయితే దోహాపై దాడి విషయం అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని ఖతార్‌కు మాత్రం చెప్పకుండా ఆలస్యం చేసింది. దీన్ని బట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నారనే అనుమానం మొదలయ్యింది.
ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో హమాస్ కు చెందిన కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి గురించి అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని టెల్అవీవ్ స్పష్టం చేసింది. అగ్రరాజ్యం కూడా దాన్ని అంగీకరించింది. ఖతార్‌కు సమాచారం ఇచ్చామని అమెరికా పేర్కొంది. అయితే, దాడులు మొదలైన 10 నిమిషాల తర్వాత యూఎస్ నుంచి తమకు కాల్ వచ్చిందని ఖతార్ విదేశాంగ శాఖ అధికారి ఒకరు ఆసహానం వ్యక్తం చేశారు. పేలుళ్లు జరుగుతుండగా.. అమెరికా అధికారి నుంచి కాల్ వచ్చిందని తెలిపారు. అయితే కాల్పుల విరమణకు సంబంధించి చివరి హెచ్చరికగా యూఎస్ ప్రతిపాదన మేరకే దోహాలో చర్చలు జరుగుతున్నాయన్నారు. అలాంటి సమయంలో ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. కాగా, అయితే ఖతార్ పై దాడులు జరుగుతాయన్న సమాచారం ఉన్నప్పుడు ముందుగానే ఎందుకు చెప్పలేదనే అనుమానాలు ఆ దేశాధికారుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల మిత్రదేశాలతో ట్రంప్ వ్యవహరం చర్చనీయంశగా మారింది. మిత్ర దేశమంటూనే భారత్‌పై భారీ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. తాజా దాడులతో ఖతార్‌తోనూ ట్రంప్ గేమ్ ఆడుతున్నట్లు అనుమానాలు వస్తున్నాయి.
అమెరికా- ఖతార్‌ల మధ్య బంధం ఈమధ్య బాగా బలపడింది. ఆ దేశ పాలకుల నుంచి విలాసవంతమైన విమానాన్ని అధ్యక్షుడు బహుమతిగా కూడా అందుకున్నారు. ఇక, ఆ దేశం పర్యటించిన సందర్భంలో పలు కీలక ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. పశ్చిమాసియాలో తన దౌత్య ప్రయత్నాలను విస్తరించడానికి ఖతార్ కీలకపాత్ర పోషిస్తోంది. హమాస్- ఇజ్రాయెల్‌ల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇలాంటి అమెరికా మిత్రదేశంపై ఇజ్రాయెల్ దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అంతేకాదు ఈ దాడులకు సంబంధించి అమెరికా మాట్లాడిన తీరు గందరగోళానికి గురి చేసింది. ఈ విషయమై వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడారు.. ఈ దాడి గురించి తెలియజేయాలని పశ్చిమాసియా రాయబారి విట్కాఫ్‌ను ట్రంప్ ఆదేశించారన్నారు. అయితే ఈ ఘటన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. దాడి గురించి ముందే చెప్పామంటూ హడావుడిగా వివరణ ఇచ్చారు. అనంతరం దాడికి సంబంధించిన నిర్ణయం తాను తీసుకోలేదంటూ తప్పించుకునే క్రమంలో పోస్టు పెట్టారు. మరోసారి ఇలాంటి దాడులు జరగవని హామీ కూడా ఇచ్చారు. ఈ దాడి పూర్తిగా తమ చర్యేనని, ఇందులో యూఎస్ ప్రమేయం లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టంచేశారు. ఈ క్రమంలో ఖతార్‌కు ట్రంప్ ద్రోహం చేశారంటూ నెట్టింట పోస్టులు వైరల్ గా మారాయి.
Also Read : మళ్ళీ భారీగా పెరిగిన బంగారం.. ఒక్క రోజులోనే రూ. 5 వేలకు పైగా..