Trump Tariffs: రాగిపై 50, ఫార్మాపై 200శాతం సుంకాలు..భారత్ పై భారీ ఎఫెక్ట్

ఆగస్టు 1 నుంచి ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పడంతో పాటూ రాగి పై 50, ఫార్మీపై 200శాతం సుంకాలు ఉంటాయని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇది మిగతా దేశాలతో పాటూ భారత్ పై కూడా భారీ ఎఫెక్ట్ చూపించనుంది. మరిన్ని వివరాలు కింది ఆర్టికల్ లో..

New Update
usa

Pm Narendra Modi, President Trump

 అమెరికా ఇప్పటికే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను అనౌన్స్ చేసింది. ఇప్పుడు వాటికి తోడు రాగిని కూడా చేర్చారు అధ్యక్షుడు ట్రంప్. రాగిపై 50 శాతం సుంకాలను ప్రకటించారు. అలాగే అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై సుంకాలు ఒక సంవత్సరం తర్వాత 200 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. ఇవన్నీ ఆగస్టు 1 నుంచి అమలు అవుతాయని తెలిపారు. ఇక బ్రిక్స్ దేశాలపై 10 శాతం సుంకం విధించడాన్ని ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. ఈ దేశాలు అమెరికన్ డాలర్ ను సవాల్ చేస్తున్నాయని అన్నారు. వారు అలా చేసినా పర్వాలేదు కానీ సుంకాలు చెల్లించాల్పిందేనని తేల్చి చెప్పారు. 

రాగి, ఫార్మా సుంకాలతో భారత్ పై భారీ ఎఫెక్ట్..

అమెరికా రాగి, ఫార్మాలపై విధించిన సుంకాలు మిగతా దేశాలతో పాటూ భారత్ పై కూడా అత్యంత ఎక్కువగా ప్రభావం చూపించనున్నాయి. ఎందుకంటే అమెరికాకు ఎక్కువగా రాగి, మందులను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ ఒకటి గా ఉంది. 2024-25లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా $2 బిలియన్ల విలువైన రాగి, దాని ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇందులో US మార్కెట్లకు ఎగుమతులు $360 మిలియన్లు లేదా 17 శాతంగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య డేటా ప్రకారం.. సౌదీ అరేబియా (26 శాతం) మరియు చైనా (18 శాతం రాగిని ఉత్పత్తి చేస్తుండగా..మూడో స్థానంలో భారత్ ఉంది.  భారతదేశం రాగి ఎగుమతులకు అమెరికా మూడవ అతిపెద్ద మార్కెట్. 

ఇక ఫార్మా విషయానికి వస్తే..రాగి కన్నా ఈ రంగం మరింత ఎఫెక్ట్ కానుంది. ఫార్మాపై 200 శాతం సుంకాలు విధించడం చాలా ఎక్కువ హాని కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా భారతదేశంలో అతిపెద్ద విదేశీ ఫార్మా మార్కెట్..2025లో ఈ ఎగుమతులు $9.8 బిలియన్లకు పెరిగాయి. గత ఏడాది $8.1 బిలియన్లు ఉండగా..ఇప్పుడు అది 21 శాతం పెరిగాయి. ఇది భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా మొత్తం ఎగుమతుల్లో 40 శాతంగా ఉంది. ఈ రంగంపై 200 శాతం లెవీ విధించడం వల్ల డిమాండ్ తీవ్రంగా ప్రభావితమవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే సుంకాల విషయంలో భారత్, అమెరికాకు మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇవి మరో రెండు రోజుల్లో ఒక కొలిక్కి వస్తాయని తెలుస్తోంది. ఈ ఒప్పందాలు కనుక ఖరారు అయితే కొత్త సుంకాలు భారత మార్కెట్లపై ప్రభావం చూపించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. 

Also Read: Pakistan: ప్రభుత్వం, ఆర్మీపై వ్యతిరేక వార్తలు..ఇమ్రాన్ ఖాన్ పార్టీ యూట్యూబ్ ఛానెల్ బ్యాన్

Advertisment
Advertisment
తాజా కథనాలు