Pakistan: ప్రభుత్వం, ఆర్మీపై వ్యతిరేక వార్తలు..ఇమ్రాన్ ఖాన్ పార్టీ యూట్యూబ్ ఛానెల్ బ్యాన్

పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే వారిపై అక్కడ కోర్టు వేటు వేసింది. పాకిస్తాన్ సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నివేదిక ఆధారంగా 27 యూట్యూబ్ ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

New Update
Imran Khan

Imran Khan

పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ యూట్యూబ్ ఛానెల్ తో పాటు.. సీనియర్ జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తల ఛానెల్స్ ను బ్యాన్ చేసింది అక్కడి కోర్టు.  ప్రభుత్వం, ఆర్మీ వ్యతిరేక వార్తలను ప్రసారం చేసినందుకే ఈ చర్యలను తీసుకుంది. దేశంలో 27 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఈ యూట్యూబ్ ఛానెళ్లన్నీ పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.  దీనికి సంబంధించి పాకిస్తాన్ సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నివేదిక సమర్పించింది. 

ఇమ్రాన్ ఖాన్ యూట్యూబ్ ఛానెల్ తో పాటూ 27 బ్యాన్..

బ్లాక్ చేసిన వాటిల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత యూట్యూబ్ ఖాతా, పాకిస్తాన్ ప్రధాన ప్రతిపక్షం, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధికారిక యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్, అసిమ్ మునీర్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఛానెల్ , పిటిఐ ఒక ప్రకటన విడుదల చేశాయి. పాకిస్తాన్‌లో దేశాన్ని పాక్ ప్రభుత్వం కాదు, సైన్యం నడుపుతుందనే నిజం ఇప్పుడు బయటపడిందని ఆ ప్రకటన లో ఉంది.

అలాగే యూట్యూబ్ ఛానెల్స్ తో పాటూ పాక్ లోని సీనియర్ జర్నలిస్ట్ మొయిద్ పిర్జాదా, అర్షద్ షరీఫ్ సహచరుడు, మానవ హక్కుల కార్యకర్త అర్జూ కజ్మీ, దైనిక్ కుద్రత్‌తో సంబంధం ఉన్న అనేక మంది పేర్లు కోర్టు బ్యాన్ చేసిన వారి లిస్ట్ లో ఉన్నాయి. వీరందరూ పాక్ సైనాన్నికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే శిక్ష పడిందని చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ లో ఇలా మీడియా, సోషల్ మీడియాలపై చర్యలు తీసుకోవడం కొత్త విషయమేమీ కాదని అంటున్నారు. ఇంతకు ముందు కూడా  ISI ఉగ్రవాదులను ప్రశంసిస్తూ, బహిరంగంగా ప్రచారం చేస్తున్న సమయంలో ఇలాంటి చర్యే తీసుకున్నారని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికీ లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద వ్యాప్తి సంస్థల ప్రాక్సీ ఖాతాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా బహిరంగంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

Also Read: China-USA: టిబెట్ కు, తమకు మధ్య చిచ్చు..అమెరికాపై చైనా మండిపాటు

Advertisment
Advertisment
తాజా కథనాలు