Donald Trump: ట్రంప్ గెలిచాడు.. బంగారం ధరలు పడిపోయాయి! అమెరికాలో ట్రంప్ విజయం బంగారం, వెండి ధరలపై పడింది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్న బంగారం ధరలకు ట్రంప్ ఎండ్ కార్డు వేశారు. నిన్న ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ప్రస్తుతం 24 క్యారెట్లు బంగారం ధర రూ.79,000.. కిలో వెండి ధర రూ.93,000 వద్ద కొనసాగుతోంది. By V.J Reddy 07 Nov 2024 in ఇంటర్నేషనల్ బిజినెస్ New Update షేర్ చేయండి Gold Rates: బంగారం ధరలపై అమెరికా ఎన్నికల ప్రభావం పడింది. ట్రంప్ ఎన్నికతో ఒక్కసారిగా బంగారం రేట్ పడిపోయింది. ట్రంప్ రాకతో డాలర్ బలపడుతుందని మార్కెట్ అంచనా వేస్తోంది. నిన్న ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి బంగారం, వెండి ధరలు చేరుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా, దేశీయంగా గిరాకీ తగ్గడంతో బంగారం, వెండి దిగి వచ్చాయి. 24 క్యారెట్లు బంగారం ధర రూ.79,000 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.93,000 వద్ద కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం అమ్మకాలు 15% తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. ట్రంప్ ఎన్నిక, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, డాలర్ బలోపేతం కారణంగా ఇండియాలో బంగారం ధరలు మరింత తగ్గనున్నట్లు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. Also Read : HBD Anushka: యోగ టీచర్ నుంచి సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి.. అనుష్క సినీ జర్నీ Also Read : Biryani: బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలు.. ఏడుగురు పోలీసుల సస్పెండ్ భారత్ పై ట్రంప్ ఎఫెక్ట్... ట్రంప్ తన మొదటి టర్మ్‌లో అనేక దేశాలపై, ముఖ్యంగా చైనా, భారతదేశం దిగుమతులపై అధిక సుంకాలను విధించే విధానాన్ని అనుసరించారు. ఇప్పుడు ఆయనే మళ్లీ అధ్యక్షుడు కావడంతో ఈ సారి కూడా భారతీయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే అవకాశం ఉందన్న భయం నెలకొంది. 2022-23 సంవత్సరంలో, భారతదేశం అమెరికాకు $78.54 బిలియన్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి $50.24 బిలియన్లను దిగుమతి చేసుకుంది. దీంతో అమెరికాతో వాణిజ్యంలో భారత్ లాభదాయకంగా ఉందని స్పష్టమవుతోంది. భారత ఎగుమతులపై ట్రంప్ భారీగా సుంకం విధిస్తే.. అది భారతీయ ఉత్పత్తుల ధరను పెంచుతుంది. Also Read : HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా? Also Read : Glenn Maxwell: ఆర్సీబీ రిలీజ్ చేయడంపై మ్యాక్స్‌వెల్ సంచలన కామెంట్స్! #silver-price #gold-rates-dropped #donald-trump మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి