Zelenskyy Vs Trump: నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి.. ట్రంప్‌తో వివాదంపై జెలెన్‌స్కీ ఫైర్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో వివాదంపై ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అమెరికా అధ్యక్షుడిని, ప్రజలను గౌరవిస్తా. కానీ క్షమాపణ అడిగేంత తప్పు నేనేమీ చేయలేదు. ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమే' అన్నారు.

New Update
trump zeln

trump zeln Photograph: (trump zeln)

Zelenskyy Vs Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో వివాదంపై ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం వైట్ హౌస్ వేదికగా ఈ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్ స్కీ శ్వేథసౌధంనుంచి వెళ్లిపోయారు. అయితే ఈ ఇష్యూపై మీడియాతో మాట్లాడిన జెలెన్ స్కీ.. తాను ట్రంప్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 

నేనేమీ తప్పు చేయలేదు..

ఈ మేరకు ట్రంప్ కు సారీ చెబుతారా అనే జర్నలిస్ట్ ప్రశ్నకు బదులిచ్చిన జెలెన్ స్కీ.. ‘నేను అమెరికా అధ్యక్షుడిని, ప్రజలను గౌరవిస్తా. క్షమాపణ అడిగేంత తప్పు నేనేమీ చేయలేదు. ఇది చాలా క్లిష్టమైన సమయం. ఇందులో ఫ్రెండ్ షిప్ ఎక్కడ ఉంది? ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమే' అన్నారు. ఇక అమెరికా, రష్యా మధ్య సంబంధం ఉన్నప్పటికీ ట్రంప్‌ తటస్థంగా ఉండాలని సూచించారు. న్యాయంగా చెప్పాలంటే ట్రంప్ తమవైపు ఉండాలన్నారు. స్నేహం కోరుకుంటున్న దేశాలమధ్య వైరం మంచిది కాదని అభిప్రాయపడ్డారు జెలెన్ స్కీ. 

Also Read: Dwaraka : కల వచ్చిందని శివలింగం దొంగతనం..వీడిన ద్వారకా మిస్టరీ

అసలేం జరిగిందంటే.. 

ఈ మేరకు రష్యా దాడులను అరికట్టాలని, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చాలంటూ జెలెన్ స్కీ శుక్రవారం అమెరికా మద్ధతు కోసం వైట్ హౌస్ వచ్చారు. అయితే ఇందుకు బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని ట్రంప్ కోరారు. దానికి జెలెన్ స్కీ అంగీకరించకపోవడంతో 'మాతో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది.. లేదంటే మీ దారి మీరు చూసుకోండి' అని ట్రంప్ అన్నారు. దీంతో  భవిష్యత్తులో తమపై రష్యా దాడులకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్ స్కీ బలంగా అడిగారు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన ట్రంప్.. ఇన్నాళ్లుగా సాయపడుతూ వస్తున్న దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదన్నారు.  ఇది అవమానకరంగా ఉందంటూ జెలెన్ స్కీపై మండిపడ్డారు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని హెచ్చరించారు.

Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

Advertisment
తాజా కథనాలు