/rtv/media/media_files/2025/12/23/trump-2025-12-23-18-23-05.jpg)
Trump Triples Migrant Self-Deportation Bonus to 3,000 dollars
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో స్వచ్ఛందంగా వెళ్లిపోయే వాళ్లకి అమెరికా స్టైఫండ్ ఆఫర్ ఇచ్చింది. అయితే తాజాగా ఈ ఆఫర్‌ను మరింత పెంచింది. అమెరికా విడిచి వెళ్లేందుకు అంగీకరిస్తామన్న వాళ్లకు స్టైఫండ్‌ను 3 వేల డాలర్లకు (రూ.2.68 లక్షలు) పెంచినట్లు తెలిపింది. స్వదేశానికి వెళ్లిపోయేందుకు ఉచితంగా ప్రయాణ సదుపాయానికి ఇది అదనమని పేర్కొంది. ఈ ఏడాది చివరి వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని వెల్లడించింది.
Also Read: విజయ్ మాల్యా, లలిత్ మోదీపై ఉన్న ఆరోపణలు ఏంటి ? భారత్ వీళ్లను ఎందుకు రప్పించలేకపోతోంది ?
మరోవైపు అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటోంది. వందలాది మందిని అరెస్టులు చేస్తూ ఆ తర్వాత వాళ్లని నిర్బంధ కేంద్రాలకు పంపించేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కీలక ప్రకటన చేసింది. స్వచ్ఛందంగా అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకునే వాళ్లకి వెయ్యి డాలర్లు ఇస్తామని తెలిపింది. దీనికోసం కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ హోమ్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచనలు చేసింది. ఇలా చేసేవాళ్లని నిర్బంధించమని, బలవంతంగా స్వదేశానికి పంపించిన లిస్ట్ నుంచి తొలగిస్తామని తెలిపింది. వాళ్లపై విధించిన జరిమానాలపై కూడా మినహాయింపులు ఇస్తామని పేర్కొంది. ఇప్పుడు తాజాగా ఆ ఆఫర్‌ను రూ.3 వేల డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Also Read: 54ఏళ్ల ఇండియా-బంగ్లాదేశ్ ప్రయాణం.. దోస్తానా? దుష్మనా?
ప్రభుత్వం అందిస్తోన్న ఈ స్పెషల్ ఆఫర్‌ను అక్రమ వలసదారులు సద్వినియోగం చేసుకోకపోతే అరెస్టు, బహిష్కరణ తప్పదని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి వాళ్లకు మళ్లీ అమెరికాకు తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఉండదని తేల్చిచెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 19 లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందగా దేశాన్ని వదిలి వెళ్లిపోయారని DHS తెలిపింది. వీళ్లలో కొన్నివేల మంది CBP హోమ్ యాప్‌ను వాడినట్లు తెలిసింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే 1.5 లక్షల మందిని బహిష్కరించినట్లు తెలుస్తోంది. మరో 13 వేల మంది స్వచ్ఛంగా వెళ్లిపోయినట్లు సమాచారం.
Follow Us